ప్లాస్మా దానానికి పెరుగుతున్న డిమాండ్,కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం విదితమే.దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ కరోనా కరాళ నృత్యం చేస్తుంది.

 Karnataka Govt Announces Incentives Of Rs 5,000 For Plasma Donors, Karnataka Gov-TeluguStop.com

రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండటం తో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లాక్ డౌన్ ను కూడా విధించింది.అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ప్లాస్మా దానం పై ప్రజలకు ఆసక్తి కలిగే విధంగా ప్రోత్సహకాన్ని ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా కు ఎలాంటి మందు లేకపోవడం, దానికి తోడు ప్లాస్మా థెరపీ ద్వారా ఈ మహమ్మారి నుంచి కోలుకొనే అవకాశం ఉందంటూ నిపుణుల సూచనలు చేసిన విషయం తెలిసిందే.దీనితో ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీ కి డిమాండ్ పెరిగిపోయింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్లాస్మా థెరపీ నే ఆశాజనకంగా కనిపిస్తుంది.దీనితో ప్లాస్మా దానం చేసే వారిని ప్రోత్సహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచే ఈ ప్లాస్మా దానం అనేది చేస్తారు.అలా కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మా ను దానం చేస్తే కరోనా బారిన పడిన వారికి కోలుకున్న వారి నుంచి కలెక్ట్ చేసిన ప్లాస్మా ను ఎక్కిస్తే మంచి ఫలితాలు ఉండడం తో కర్ణాటక ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.

ఇలా ప్లాస్మా ను దానం చేసే వారికి ప్రోత్సాహం అందించడం కోసం ప్లాస్మా ను దానం చేసిన వారికి రూ.5000 అందించనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ కె.సుధాకర్ ప్రకటించారు.ప్లాస్మా థెరపీ ద్వారా మెరుగైన ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube