జూరాల ప్రాజెక్ట్ నీటివిడుదల కు అంగీకరించిన కర్ణాటక ప్రభుత్వం

తాగునీటి ఎద్దడి దృష్ట్యా జూరాల ప్రాజెక్టు కు నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తుంది.జూరాల ప్రాజెక్టుకు 3 టీ ఎంసీ ల నీటిని విడుదల చేయాలనీ కర్ణాకట ప్రభుత్వానికి తెలంగాణా ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.

 Karnataka Government Agreed To Release The Water For Jurala Project-TeluguStop.com

ఈ విషయాన్నీ కర్ణాకట సీ ఎం కుమార స్వామి తెలంగాణా సీ ఎం కేసీఆర్ కు ఫోన్ ద్వారా తెలిపినట్లు తెలుస్తుంది.జూరాల ప్రాజెక్టు కు నీటిని విడుదల చేయాలని అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి కర్ణాటక సి ఎం తీ ఎం విజయ్ భాస్కర్ కు లేఖ రాశారు.

తాగు నీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచో జూరాల ప్రాజెక్టు కు వీలైనంత త్వరగా నీటిని విడుదల చేయాలని లేఖలో పేర్కొనగా,దానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తుంది.
దీనితో ఈ రోజు సాయంత్రమే జూరాల ప్రాజెక్టు కు తెలంగాణా సర్కార్ కోరిన విధంగా 3 టీఎంసీ ల నీటిని విడుదల చేయడానికి కర్ణాటక సీ ఎం కుమార స్వామి అంగీకరించారు.

ఈ విషయాన్ని తెలంగాణా సి ఎం కేసీఆర్ కు కుమార స్వామి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది.దీనితో సి ఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరపున కర్ణాటక సీ ఎం కు కృతఙ్ఞతలు తెలిపారు.

భవిష్యత్తు లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఇలాంటి సంబంధాలే కొనసాగాలని, ఆ దిశగా ఇరు రాష్ట్రాలు సహకరించుకోవాలని కేసీఆర్ కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube