కర్ణాటకలో ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటీకరణ, తెలంగాణలోనూ అదే పద్దతా?  

karnataka governament do the tottal rtc are private - Telugu Karnataka Governament,, Telangana Bjp. Karnataka Bjp Are Support To Rtc In Private, Telangana Cm Kcr Strict In Rtc, Telangana Rtc Strike

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతోంది.సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఆర్టీసీని కాపాడాలంటూ కార్మికులు కోరుతున్నారు.

TeluguStop.com - Karnataka Governament Do The Tottal Rtc Are Private

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కాని ప్రభుత్వం మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు.నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు అంటూ సీఎం కేసీఆర్‌ పదే పదే చెబుతున్నాడు.

ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీని విలీనం చేయం అంటూ కేసీఆర్‌ ప్రకటించినా కూడా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు.ఇలాంటి సమయంలోనే కర్ణాటకలో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన జీవో మేరకు ఆర్టీసీని ప్రైవేట్‌ రంగంగా మార్చినట్లుగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.ఈ విషయమై కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తర్వులు కూడా వచ్చాయి.

ఇప్పటికే అక్కడ పలు రూట్లకు ప్రైవేట్‌ పర్మిట్లు ఇచ్చారు.ఇప్పుడు పూర్తిగా ఆర్టీసీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చేసింది.

కర్ణాటకలో తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు మరింత బలం వచ్చినట్లయ్యింది.బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఆర్టీసీని ప్రైవేట్‌ చేయడంతో తెలంగాణలో మాత్రం ఎందుకు బీజేపీ ఇలా సమ్మెకు మద్దతు ఇస్తుందంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కార్మికులు సమ్మె విరమించినా విరమించకున్నా కూడా భవిష్యత్తులో ఆర్టీసీ ప్రైవేట్‌ పరం అవ్వడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#TelanganaCM #TelanganaBJP. #TelanganaRTC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు