అరుదైన సొరచేపను పట్టుకున్న కర్ణాటక మత్స్యకారులు.. వైరల్ అవుతున్న వీడియో..

అంతరించిపోతున్న లార్జ్‌టూత్ సాఫిష్‌ అనే ఓ సొర చేపను ఉడిపి జిల్లాలోని మత్స్యకారులు తాజాగా పట్టుకున్నారు.దీన్ని కార్పెంటర్ షార్క్ అని కూడా పిలుస్తారు.

 Karnataka Fishermen Catch A Rare Shark  Rare Fish, Karnataka, Viral Latest,  New-TeluguStop.com

కొద్ది గంటల క్రితం కర్ణాటక మత్స్యకారులు పట్టుకున్న ఈ చేప దాదాపు 10 అడుగుల పొడవు, 250 కిలోల బరువు ఉంది.దీనికి ముందు భాగంలో రంపం లాంటి ఒక మూతి ఉంటుంది.

ఇది చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుంది.

మాల్పే తీరంలో మత్స్యకారులు వేసిన ఓ వలల్లో ఇది అనుకోకుండా చిక్కుకుంది.

దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ గా మారింది.అయితే ఇది వలలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అయ్యి అలాగే చనిపోయింది.

చనిపోయిన రంపపు చేపను ఓడరేవు నుంచి నెమ్మదిగా క్రేన్‌ సాయంతో వేలం వేసే ప్రదేశానికి తరలించారు.ఈ దృశ్యాలను వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూడొచ్చు.

జేసీబీ సొరచేపను మాల్పే ఫిషింగ్ హార్బర్‌లోని వేలం ప్రాంతానికి తీసుకువెళ్లింది, అక్కడ దానిని మంగుళూరు వ్యాపారికి విక్రయించినట్లు సమాచారం.లార్జ్‌టూత్ సాఫిష్ ఐదు రంపపు చేప జాతులలో ఒకటి, వీటిలో మూడు అంతరించిపోతున్నాయని వైల్డ్ లైఫ్ సంరక్షణ అధికారులు గతంలో పేర్కొన్నారు.అయితే వేటగాళ్ల వల్లనే ఈ జాతి చేపలన్నీ కనుమరుగవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.ఈ చేప రెక్కలు, రంపాలు, దంతాల కోసం కూడా వేటగాళ్లు వాటిని పట్టుకుంటుంటారు.ఇవి ఆహారంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఔషధ ప్రయోజనాల కోసం వాడతారు.వైరల్ అవుతున్న వీడియో చూసి జంతు ప్రేమికులు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు.

మనుషుల వల్ల సముద్రంలో నివసించే జీవులకు కూడా ప్రాణహాని తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube