వేసుకున్న బట్టల ఆధారముగా రైతును అవమానించిన షోరూమ్ నిర్వాహకులు.. చివరికి..?!

రైతు లేనిదే మానవ మనుగడ లేదు. మనం రెండు పూటలా అన్నం తింటున్నామంటే దానికి కారణం ఒక రైతు.

 Karnataka Farmer Bought Ten Lakhs Car After Being Insulted Details,  Farmer's, L-TeluguStop.com

ఆ రైతు రాత్రి అనక పగలు అనక కష్టపడడం వలనే మనం ఈరోజు ఇలా ఉన్నాము.అలాంటి ఒక రైతుకు అవమానం జరిగింది.

దుస్తులు చూసి ఆ మనిషి యొక్క స్వభావం ఎలా నిర్ణయిస్తారు చెప్పండి.రైతు అన్నాక బట్టలు మురికిగానే ఉంటాయి కదా.అలాంటి ఒక రైతుకు కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని ఒక ఆటోమోబైల్ షోరూంలో అవమానం జరిగింది.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి పికప్ ట్రక్ కొనడానికి ఒక రైతు షోరూమ్‌కు వెళ్ళాడు.ఆయన వేసుకున్న బట్టలు చూసి షోరూమ్ లో ఉన్న ఒక సేల్స్‌మెన్ అవమానించాడని ఆ రైతు ఆరోపించడం జరిగింది.

ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ రైతు ఏమి చేసాడో తెలుసా.సరిగ్గా చిరంజీవి సినిమాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి ఉంటుంది.పంచి కట్టు కట్టుకున్నాడని కార్ షోరూమ్ లో ఎగతాళి చేసి మాట్లాడినందుకు వేంటనే చిరంజీవి ఆ షోరూమ్ లో డబ్బుల కట్టలు కుప్పలు తెప్పలుగా పోస్తాడు.అవి చూసి షోరూమ్ వాళ్ళు ఎక్కడ లేని గౌరవ మర్యాదలు ఇస్తారు.

డబ్బు ఉంటేనే గౌరవం అని సినిమాలో ఆ ఘటన ద్వారా అర్ధం అవుతుంది.సరిగ్గా అలాగే ఈ రైతు కూడా షో రూమ్ సేల్స్ మాన్ ను సవాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయి వెంటనే రూ.10 లక్షలతో తిరిగి షోరూమ్ కి వచ్చాడు.

Telugu Lakhs Car, Farmers, Karnataka, Kempegowda, Latest-Latest News - Telugu

కానీ షోరూమ్ ఆ రైతుకు వాహనం డెలివరీ చేయడంలో అసమర్థతను చూపించింది.ఈ వీడియో చూసాక చాలా మంది ప్రజలు ఆ షోరూమ్‌ వ్యక్తులు వినియోగదారులపై వివక్ష చూపుతున్నారని తమ అభిప్రాయాన్ని తెలియచేసారు.ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఒకసారి చూస్తే.

గత శుక్రవారం నాడు చిక్కసంద్ర హోబ్లీ పరిధిలోని రామన్‌పాళ్యకు చెందిన కెంపేగౌడ అనే రైతు తన సహచరులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు ఒక షోరూమ్‌కు వెళ్లాడు.అయితే అక్కడ తను వేసుకున్న బట్టలు, అతని పరిస్థితి చూసి నేను డబ్బులిచ్చే పరిస్థితిలో లేను అని నన్ను అవమానించారంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే నీ దగ్గర 10 రూపాయలు కూడా లేవు కానీ కారు కొనడానికి వచ్చావా అని అక్కడ ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ ఒకరు తనతో అన్నారు.

అసలు కారు కొనుక్కోవడానికి వచ్చే వారు ఇలా షోరూమ్కి వస్తారా అని కూడా అన్నారని తెలిపారు.

Telugu Lakhs Car, Farmers, Karnataka, Kempegowda, Latest-Latest News - Telugu

అతని మాటలు విన్నాక వెంటనే 10 లక్షలతో షోరూమ్ కి వచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని సేల్స్‌మెన్‌ని సవాలు చేశాడు.దీనికి షోరూమ్‌ వారు అరగంటలో నగదు రూపంలో డబ్బులు ఇస్తేనే వెంటనే కారు ఇస్తానని బదులిచ్చారు.చివరకు రూ.10 లక్షలు ఇచ్చిన 30 నిమిషాల వ్యవధిలో సేల్స్ మాన్ వాహనాన్ని తన ముందు పెట్టలేకపోయారని కెంపేగౌడ తెలిపారు.డబ్బులు చెల్లించిన వాహనాన్ని తనికి డెలివరీ చేయకపోవడంతో కోపంతో కెంపేగౌడ అతని సహచరులు పోలీసులకు సమాచారం అందించారు.వాహన్నాని వెంటనే డెలివరీ ఇవ్వాలని లేదా తమని అవమానించినందుకు షోరూమ్ వాళ్ళు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు సమస్యను సామరస్యంతో పరిష్కరించారు.ఇకపై ఈ షోరూం నుంచి మాకు ఎలాంటి వాహనం అక్కర్లేదని, కానీ షోరూం వారు మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి అక్కడ నుండి వాళ్ళు వెళ్లిపోయారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube