“కర్ణాటక” లో గెలుపు ఎవరిదో తేల్చి చెప్పిన “ఎగ్జిట్ పోల్స్”

దేశంలో ఉన్న అన్ని పార్టీలు.ప్రజలు ఇప్పుడు ఎదుర్ చూస్తోంది కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించే ఈ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపిల దశా దిశ లని మార్చబోతున్నాయి.

 Karnataka Exit Polls Result-TeluguStop.com

ఇక్కడ గనుకా కాంగ్రెస్ నెగ్గితే బీజేపి కి కోలుకోలేని ఎదురుదెబ్బే అంటున్నారు విశ్లేషకులు.ఇదిలాఉంటే ఒక వేళ బీజేపి గనుకా నెగ్గితే కాంగ్రెస్ కి దక్షినాది రాష్ట్రాలపై పట్టు సాధించడం ఎంతో కష్టం అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

అయితే పోలింగ్ సరళిని బట్టి ఓటర్ల మనోగతం ఆధారంగా అచేసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఎక్జిట్ పోల్స్ తమ అభిప్రాయాలని వెల్లడించాయి.

ముందుగా ఇండియా టుడే యాక్సిస్ సంస్థతో కలిసి చేసిన సర్వేలో కాంగ్రెస్ అధికారం చేపట్టటానికి కావాల్సిన 113 సీట్లని పూర్తిగా గెలుచుకోలేక పోయినా సరే 106 నుంచి 118 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని గెలుచుకుంటుంనే విషయాన్ని స్పసాటం అని తెలిపింది.భారతీయ జనతా పార్టి 79 నుంచి 92 సీట్లను గెలుచుకుంటుందని.బిజెపి తెలుపడంతో బీజేపి నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.

ఇక జనతాదళ్(సెక్యులర్) 22 నుంచి ముప్పై స్థానాలు గెలుచుకుంటుంది అని, ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాలు గెలుస్తుందని తెలిపింది.

ఇదిలాఉంటే.

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ కి తిరుగులేదని టైమ్స్ నౌ – విఎంఆర్ ఎక్జిట్ పోల్’ పేర్కొంది.పోలింగ్ ముగిసిన వెంటనే ఆ ఛానల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తెలిపింది ఆ ఛానల్ వెల్లడించిన ఫలితాల వివరాల ప్రకారం చూస్తే.

కాంగ్రెస్‌కు 90-103, బీజేపీకి 80-93, జేడీఎస్‌కి 31-39, ఇతరులకు 2-4 స్థానాలు దక్కే అవకాశం ఈ పోల్స్‌లో దాదాపు 7000 మంది ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకున్నట్లుగా ఆ ఛానల్ తెలిపింది.దాదాపు 600 పోలింగ్ బూత్‌లలో ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది.

ఇక జనతాదళ్.19.8% వోట్ షేర్, ఇతరులు 7.2% ఓట్లు సాధిస్తుంది అని తెలిపింది.ABP-CSDS ఎజ్కిట్ పోల్ సర్వే ప్రకారం బిజెపి అతి పెద్ద పార్టి గా అవతరిస్తుందని బిజెపికి 89 నుంచి 95 స్థానాలు గెలుచుకుంటుంది అని తెలిపింది.కాంగ్రెస్ 85 నుంచి 91 సీట్లను గెలుచుకుంటుంది అని తెలియ చేసింది.

జనతాదళ్(సెక్యులర్) 32 నుంచి 38 స్థానాలు గెలుచుకుంటుంది అని చెప్పింది.రిపబ్లిక్ సర్వే కూడా బిజెపి కి ఆధిక్యం వస్తుంది,,నిర్వహిద్దామని అత్నున్నారు .ఇదిలాఉంటే భారతీయ జనతా పార్టి 73 నుంచి 82 సీట్లను గెలుచుకుంటుంది అని చెప్పింది.

అయితే NewsX-CNX ఎక్జిట్ పోల్ లో…BJP 102 నుంచి 110 స్థానాల్లో విజయం సాధిస్తుంది అని, కాంగ్రెస్ 72 నుంచి 78 స్థానాల్లో విజయం సాధిస్తుంది అని, JD(S) 35 నుంచి 39 స్థానాల్లో విజయం సాధిస్తుంది.

తెలిపారు.“సి-వోటర్ ఎక్జిట్ పోల్” సర్వే ప్రకారం కాంగ్రెస్ 93 స్థానాలలో, BJP 103 స్థానాల్లో, JD(S) 25 స్థానాలలో ఇతరులు ఒక స్థానం లో గెలుస్తారు అని తెలిపాయి.

“సువర్ణ న్యూస్” కథనం ప్రకారం కాంగ్రెస్ 106-118 స్థానాలలో , BJP 79-92 స్థానాలలో, JD(S) 22-30 స్థానాలలో, ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాలలో గెలుస్తారు అని తెలిపాయి.దిగ్విజయ న్యూస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 76-80 స్థానాలలో, BJP 103-107 స్థానాలలో, JD(S) 35-37 స్థానాలలో విజయం సాధించే అవకాసం ఉందని తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube