ఘనంగా జరగనున్న మరో యువహీరో నిశ్చితార్ధం  

Karnataka Ex Cm Kumaraswami Son Nikhil Gowda Engagement - Telugu Engagement, Jaguar Hero, Jaguar Movie, , Kumaraswami ., Nikhil Gowda

మొన్న టాలివుడ్ హీరో నిఖిల్ నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఇంకా నిఖిల్ నిశ్చితార్ధం గురించి మాట్లాడుకుంటుండగానే ఇప్పుడు మరో హీరో నిఖిల్ నిశ్చితార్ధం కు సిద్దమైనట్లు తెలుస్తుంది.

Karnataka Ex Cm Kumaraswami Son Nikhil Gowda Engagement

ఏంటి నిఖిల్ అని అనుకుంటున్నారా.ఆయనే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వారసుడు,జాగ్వార్ ద్వారా టాలివుడ్ కు పరిచయం అయిన నిఖిల్ గౌడ.సోమవారం నాడు నిఖిల్ గౌడ నిశ్చితార్ధం రేవతి అనే యువతితో జరగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్నీ స్వయంగా కుమారస్వామి మీడియా కు వెల్లడించారు.

సోమవారం నాడు తాజ్ వెస్టెండ్ హోటల్ లో ఈ నిశ్చితార్ధ వేడుకను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.నటుడుగా,రాజకీయ నేతగా తన కుమారుడిని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరినీ ఈ వేడుకకు ఆహ్వానిస్తానని కుమార స్వామి తెలిపారు.

అంతేకాకుండా వీరి పెళ్లిని కూడా చాలా ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఈ నిశ్చతార్ధ వేడుకకు అన్ని రాజకీయ పార్టీల నేతలను,అలానే ప్రముఖులను దాదాపు 4 వేల మందిని ఆహ్వానించినట్లు కుమార స్వామి తెలిపారు.

నిఖిల్ గౌడ ‘జాగ్వార్’ చిత్రంలో హీరోగా సందడి చేసిన విషయం విదితమే.అయితే రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండే నిఖిల్ గత లోక్ సభ ఎన్నికల్లో మాత్రం మాండ్యా నుంచి జేడీఎస్ తరఫున బరిలోకి దిగి, ఇండిపెండెంట్ గా నిలిచిన సినీనటి,దివంగత నేత అంబరీష్ సతీమణి సుమలత చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karnataka Ex Cm Kumaraswami Son Nikhil Gowda Engagement Related Telugu News,Photos/Pics,Images..

footer-test