ఊరుకోమ్మా : మోసం చేసారంటూ ఏడ్చిన కుమారస్వామి  

Karnataka Ex Cm Kumara Swamy Cries During Campaign-

ప్రజలు నన్ను నా కుటుంబాన్ని మోసం చేసారంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బోరున ఏడ్చినా సంఘటన మండ్య జిల్లాలోని కేఆర్ పేట్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లిన కుమారస్వామి ఓ మీటింగ్ లో మాట్లాడుతూ తన కుమారుడిని ప్రజల కోరిక మేరకే లోక్ సభ ఎన్నికల బరిలో దింపానని, అయితే ప్రజలు నిఖిల్‌ను ఓడించి మోసం చేసారంటూ కుమారస్వామి బోరున ఏడ్చేశారు.

Karnataka Ex Cm Kumara Swamy Cries During Campaign- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Karnataka Ex Cm Kumara Swamy Cries During Campaign--Karnataka Ex Cm Kumara Swamy Cries During Campaign-

మండ్యాలోని కిక్కిరి గ్రామంలో ఈ ఘటన జరిగింది.కేఆర్ పేట్ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ తరపున గెలిచిన నారాయణ గౌడ బీజేపీలోకి ఫిరాయించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి.

బీజేపీ నేతలు గొర్రెలు, పశువులను కొనుగోలు చేసినట్లుగగా ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అంటూ కుమారస్వామి మండిపడ్డారు.ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటూ శాపనార్ధాలు పెట్టారు కుమారస్వామి.

తాజా వార్తలు