“కర్ణాటక” పరిస్థితే “ఏపీ” కి కూడా వస్తుందా..?       2018-05-18   01:24:54  IST  Bhanu C

దేశ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన అంశం ఏదైనా ఉంది అంటే అది కేవలం కార్ణాటక రాజకీయమే..మొన్న జరిగిన ఎన్నికలు దేశం మొత్తం నరాలు తెగిపోయే ఉత్ఖంటగా చూసింది..కర్ణాటక గెలుపు ఓటముల ప్రభావం దక్షినాది రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనున్న నేపధ్యంలో కర్ణాటక రాజకీయాలు ఆసక్తిగా మారాయి..అయితే బీజేపి కి అక్కడ 104 స్థానాలు వచ్చాయి అయితే కాంగ్రెస్ కూటమికి మాత్రం 116 వచ్చాయి కానీ రంగు మార్చిన రాజకీయాలు కారణంగా గవర్నర్ వారం రోజులు సమయం ఇచ్చి మరీ బల నిరూపణ చేసుకోమని చెప్పారు.

అంటే ఇంకో 8 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే కానీ బీజేపి ప్రభుత్వం నిలబడదు ఇదిలాఉంటే మరో పక్క కేవలం 30 పై చీలుకు సీట్లు గెలుచుకున్న జేడీఎస్ నేత కుమారస్వామి కి కాంగ్రెస్ సీఎం ఫీటం సైతం ఇస్తామని ప్రకటించారు.. అయితే అనూహ్యంగా బీజేపీ చక్రం తిప్పడంతో అధికారం నిలబెట్టుకొంది ఈ విషయం ఇలా ఉంచితే..

ఇప్పుడు ఏపీ రాజకీయాలని ఒక్క సారి పరిశీలిస్తే..కర్ణాటక లో జరిగిన ఎన్నికల వాతావరణమే ఏపీలో కూడా రిపీట్ అవుతుంది అంటున్నారు..ఓటరు కార్ణాటక లో ఎలా ఆలోచించారో ఇక్కడ కూడా అలానే ఉంటారనేది వారి అభిప్రాయం..ఏ ఒక్క ఓటరు కూడా వన్ సైడ్ గా ఓటు వేయరు..ఇదే జరిగితే కర్ణాటక లో జేడీఎస్ పాత్ర ఫెయిల్ అయితే ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం సక్సెస్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.

ఏపీ వ్యాప్తంగా మొత్తం 175 సీట్లు ఉన్నాయి..అయితే ప్రభుత్వం నిలబడాలి అంటే తప్పకుండా 88 సీట్లు అవసరం అయితే 88 సీట్లు వచ్చినంత మాత్రాన సేఫ్ కాదని దద్దపు 95 సీట్లు అయినా గెలవాలని అంటున్నారు..కానీ వైసీపికి కానీ టీడీపికీ కానీ పూర్తీ స్థాయి మెజారిటీ వచ్చే చాన్స్ లేదు..అయితే పవన్ గనుకా ఒక 20 సీట్లు గనుకా సంపాదించగలిగితే..ఏపీలో పవన్ కింగ్ మేకర్ అవుతాడు..అంతేకాదు ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అనే విషయం పవన్ డిసైడ్ చేసే అవకాశం వస్తుంది..ఒక వేళ ఈ అంచనాలు నిజం అయితే మాత్రం ఏపీలో రాజ్యంగా సంక్షోభం తప్పదు అంటున్నారు విశ్లేషకులు.

,