కర్ణాటక లో మరింత ముదురుతున్న రాజకీయ సంక్షోభం, కారణం ఏంటి?  

Karnataka Crisis Continues-

ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలో ఇరకాటంలో పడిన కాంగ్రెస్‌-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు మరి కొందరు ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ కి చెందిన పలువురు రాజీనామా లు చేయడం ఇప్పుడు ఇంకా మరికొందరు రాజీనామా కు సిద్ధం కావడం ఇప్పుడు ఆ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరిపోతోంది. 14 మంది ఎమ్మెల్యేలకు తోడుగా తాజాగా మరో స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి నాగేశ్ కూడా రాజీనామా బాట పట్టినట్లు తెలుస్తుంది. స్వతంత్ర ఎమ్మెల్యే అయిన నాగేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు..

కర్ణాటక లో మరింత ముదురుతున్న రాజకీయ సంక్షోభం, కారణం ఏంటి?-Karnataka Crisis Continues

అంతేకాకుండా ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీపార్టీ ని గనుక ఆహ్వానిస్తే బీజేపీ సర్కారుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని ఆయన గవర్నర్ కు పంపిన లేఖలో పొందుపరచడం విశేషం. అంతేకాకుండా 14 మంది ఎమ్మెల్యే లు బీజేపీ కి తమ మద్దతు ప్రకటిస్తామని చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోపక్క కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బీజేపీ కి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

మరోపక్క కర్ణాటక సీఎం కుమారస్వామి గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో కుమార స్వామి గవర్నర్ తో భేటీ కాబోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. కర్ణాటక సీఎం గా కుమారస్వామి వద్దుఅని ఆయన స్థానంలో మాజీ హోంమంత్రి రామలింగా రెడ్డి ని ముఖ్యమంత్రిగా నియమించాలి అంటూ సోషల్ మీడియా లో పోస్టర్లు వెల్లువెత్తడం మరోపక్క ఇలా ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామాలు చేయడం వెనుక మాజీ సీఎం సిద్దరామయ్య హస్తం ఉందంటూ ఆరోపణలు రావడం తో కుమార స్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.