సిటీ బస్ కండక్టర్ అవతారం ఎత్తబోతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..!!

గత నెలలో కర్ణాటక రాష్ట్రం( Karnataka )లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం తెలిసిందే.ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ఉంది.

 Karnataka Cm Siddaramaiah Is Going To Take On The Avatar Of A City Bus Conductor-TeluguStop.com

దీనిలో భాగంగా ఇచ్చిన హామీల కీలకమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో “శక్తి” పేరుతో ఈ పథకాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రవేశపెట్టడం జరిగింది.కర్ణాటక రాష్ట్రంలో లగ్జరీ, ఏసీ బస్సులు మినహా మిగిలిన అన్నిటిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

బెంగళూరు సిటీ బస్సులతోపాటు కేఎస్ఆర్టీసీ, ఈశాన్య ఆర్టిసి, వాయువ్య ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది.

ఈనెల 11 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది.

అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ప్రతి మహిళ దగ్గర “శక్తి” స్మార్ట్ కార్డ్( Shakti smart cards ) తప్పనిసరి చేయటం జరిగింది.ఈ కార్డు పొందుకోవడానికి సేవా సింధు పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది.

అనుమతి లభించిన మహిళలకు “శక్తి” స్మార్ట్ కార్డ్ లను ప్రభుత్వం అందజేయనుంది.కర్ణాటక పరిధిలో తిరిగే మామూలు బస్సులకి మాత్రమే ఈ కార్డు వర్తిస్తూ ఉంటది.

అన్ని ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు అదేవిధంగా విద్యార్థినిలకు ఉచితంగా ప్రయాణించవచ్చు.ఈ పథకాన్ని సీఎం సిద్ధరామయ్య ఆదివారం లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.

Telugu Bengaluru, Bus, Congress, Karnataka, Karnatakacm-Telugu Political News

ఇందుకోసం సిద్ధరామయ్య కండక్టర్ అవతారం ఎత్తనున్నారు.బెంగళూరు( Bengaluru )లోని మెజిస్టిక్ కెంపెగౌడ బస్ స్టేషన్ నుంచి విధాన సౌధ వరకు రూట్ నెంబర్ 43 సిటీ బస్ లో ప్రయాణించనున్నారు.ఇదే సమయంలో స్వయంగా ప్రయాణికుల వద్ద టికెట్లను సిద్ధరామయ్య కండక్టర్ గా జారీ చేయనున్నారు.మహిళలకు స్మార్ట్ కార్డ్ లను అందజేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను భారీ ఎత్తున చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube