మ‌హిళ‌లు నైట్ డ్యూటీ చేయొద్ద‌ట‌.. బీజేపీ మ‌హిళా ఎమ్మెల్సీ వ్యాఖ్య‌ల‌పై దుమారం..

ఈ మ‌ధ్య దేశఃలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాల గురించి చూస్తూనే ఉన్నాం.ఎన్ని శిక్ష‌లు విధించినా ఎంత‌లా దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ‌చ్చినా ఇవి మాత్రం ఆగ‌ట్లేదు.

 Karnataka Bjp Mlc Bharathi Shetty Comments On Womens Night Duties-TeluguStop.com

అయితే ప్ర‌జా ప్ర‌తినిధులు కొన్ని సార్లు మ‌హిళ‌ల‌పై చేసే వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపుతున్నాయి.ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్న‌వారంతా కూడ ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.

లేక‌పోతే మాత్రం ఇబ్బందులు త‌ప్ప‌వు.ఇక‌పోతే తాజాగా బీజేపీకి చెందిన‌టువంటి ఓ మ‌హిళా ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద వివాదాస్పదంగా మారిపోయాయి.

 Karnataka Bjp Mlc Bharathi Shetty Comments On Womens Night Duties-మ‌హిళ‌లు నైట్ డ్యూటీ చేయొద్ద‌ట‌.. బీజేపీ మ‌హిళా ఎమ్మెల్సీ వ్యాఖ్య‌ల‌పై దుమారం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోష‌ల్ మీడియాలో ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారంగా మారాయంటే ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఆమె ఎవ‌రో కాదండోయ్ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ అయిన భారతి శెట్టినే.మహిళలు రాత్రి పూట ప‌ని చేసేందుకు కంపెనీలు అనుమతించరాదని అలా చేయ‌డం వ‌ల్ల‌నే మహిళలపై నేరాలు అధికంగా జ‌రుగుతున్న‌ట్టు ఆమె వివ‌రించారు.ఇలా ఓవ‌ర్ టైమ్ ప‌నిచేయ‌డాన్ని నిషేధించాల‌ని ఆమె కోరారు.ఇంకోవైపు నేరస్థుల‌ను కూడా కఠినంగా శిక్షించే విష‌జ్ఞంలో ఆల‌స్యం జ‌ర‌గ‌డం వ‌ల్లే ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివ‌రించారు.

Telugu Attrocities On Women, Bjp Mlc, Congress Chief Vip Narayanaswamy, Karnataka Bjp, Karnataka Bjp Mlc Bharathi Shetty, Mysore Gang Rape, Viral News, Womens Night Duties-Latest News - Telugu

అయితే మైసూర్ లో గ్యాంగ్ రేప్ ఘటన పెద్ద సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.అయితే ఈ చ‌ర్చ‌లో బుధవారం ఆమె పాల్గొపొ ఈ విధ‌మైన వ్యాఖ్య‌లు చేశారు.కాగా ఆమె వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి.ఆమె వ్యాఖ్యలు బీజేపీ చెప్తున్న రామరాజ్యానికి అనుగుణంగా లేవంటూ ఎస్ఆర్ పాటిల్ విమ‌ర్శించారు.ఆమె వ్యాఖ్య‌లు స‌రైనవి కావంటూ కాంగ్రెస్ చీఫ్ విప్ ఎం నారాయణస్వామి మండిప‌డ్డారు.బీజేపీ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాస్తోంద‌ని అందుకే ఇలాంటి మాట‌లు మాట్లాడుతున్నారంటూ దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

మ‌రి ఆమె ఎలాంటి రిప్లై ఇస్తారో వేచి చూడాలి.

#BJP MLC #KarnatakaBjp #Mysore Gang #Womens #CongressVip

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు