లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ మంత్రి రాజీనామా..!!

ఇటీవల కర్ణాటక జల వనరుల శాఖ రమేష్ జర్కిహోలి ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వార్తలు రావటం మాత్రమేకాక వీడియోలు బయటపడటంతో ఈ న్యూస్ దేశంలోనే సంచలనం సృష్టించింది.దీంతో తనపై వచ్చిన ఆరోపణలకు మంత్రి రమేష్ జర్కిహోలి తాజాగా రాజీనామా చేశారు.

 Karnataka Bjp Minister Resigns Over Sexual Harassment Allegations-TeluguStop.com

రాజీనామా లేఖను కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పంపారు.ఈ సందర్భంగా రమేష్ జర్కిహోలి మాట్లాడుతూ.

తన పై వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవం అని తెలిపారు.

 Karnataka Bjp Minister Resigns Over Sexual Harassment Allegations-లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ మంత్రి రాజీనామా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

తాను ఎలాంటి తప్పు పాల్పడలేదని, అందువల్లే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.తన ఫోటోలను ఉపయోగించి నీలిచిత్రాలగా  చిత్రీకరించి.

ఇలాంటి వీడియోను క్రియేట్ చేశారని ఆరోపించారు.జరగబోయే దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని, ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంటూ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మరోపక్క ఆరోపణలు చేసిన మహిళతో ఆయన సన్నిహితంగా మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

#Karnataka #Yadurappa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు