పాక్ పై భారత్ దాడితో బీజేపీకి లాభం! యడ్యూరప్ప వివాదాస్పద వాఖ్యలు!

ప్రస్తుతం సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొని వుంది.ఇరు దేశాల రక్షణ దళాలు యుద్ధానికి సిద్ధం అన్నట్లు మొహరించి వున్నాయి.

 Karnataka Bjp Leader Yeddyurappa Controversial Comments-TeluguStop.com

ఓ వైపు భారత్ ప్రభుత్వం అంతర్జాతీయంగా దౌత్యం నడుపుతూ పాకిస్తాన్ ని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తుంది.మరో వైపు ఆ దేశం కుట్ర పూరితంగా చేస్తున్న దాడులని తిప్పి కొట్టడానికి సిద్ధం అవుతుంది.

ఎ క్షణం ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి సరిహద్దులో కనిపిస్తుంది.మరో వైపు ఇండియన్ సైనికుడు పాకిస్తాన్ వద్ద బందీగా వున్నాడు.

ప్రస్తుతం దేశంలో ఈ రకమైన ఓ ఆందోళనకర పరిస్థితి వుంది.

ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడుతూ వుండాలి.

ఎ మాత్రం అదుపు తప్పిన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వుంటుంది.అయితే రానున్న ఎన్నికలలో బీజేపీ పాకిస్తాన్ పై దాడులని తన ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తుంది అంటూ బీజేపీయేతర పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

మరో వైపు తాజాగా బీజేపీ పార్టీకి చెందిన నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వాఖ్యలు ఇప్పుడు మరింత వివాదాస్పదం అయ్యాయి.పాకిస్తాన్ పై భారత్ దాడుల కారణంగా పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి సీట్లు పెరుగుతాయని, ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని వాఖ్యలు చేసారు.

ఈ వాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ఇబ్బందికరంగా మారడంతో పాటు విపక్షాలకి విమర్శలకి బలం ఇచ్చినట్లు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube