కుమారస్వామి పరిపాలనని నేటితో శుభం కార్డు పడనుందా  

Karnataka Assembly Floor Test-congress Party,floor Test,jds Party,karnataka Assembly,karnatana Politics

ఏ రాష్ట్రంలో అయిన అస్థిర ప్రభుత్వం ఉంటే… ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఎప్పుడు ఉంటుంది. అలాగే అనిశ్చితి రాజకీయాలకి నెలవుగా ఆ రాష్ట్రం ఉంటుంది. ఈ పరిస్థితిలో దక్షిణ భారతంలో ఎక్కువగా కర్నాటకలో కనిపిస్తుంది. అక్కడ ప్రతి సారి ఏదో ఒక సమస్య ప్రభుత్వ పరిపాలన పరంగా వస్తూ ఉంటుంది..

కుమారస్వామి పరిపాలనని నేటితో శుభం కార్డు పడనుందా-Karnataka Assembly Floor Test

నిలకడ లేని ప్రజా నాయకులు డబ్బులకి ఆశపడి కండువాలు మార్చడం వలన ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భాలు చాలా సార్లు జరిగింది. ఇప్పుడు మరోసారి కర్ణాటకలో అనిశ్చితి రాజకీయం నడుస్తుంది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది.

తాజాగా కర్ణాటకలో అధికార కాంగ్రెస్, జేడీఎస్‌కి కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ప్రభుత్వ అనిశ్చితి మొదలైంది.

ఇక క్యాంపు రాజకీయాలకి పెట్టింది పేరైన కర్నాటకలో అధికార కూటమి నుంచి బయటకి వచ్చిన అందరూ ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఎలా అయిన ప్రస్తుతం ప్రభుత్వాన్ని కూల్చేయాలనే కసితో వారంతా ఉన్నారు. వీరంతా బీజేపీ పార్టీ అండతో ముంబై ఫ్లైట్ ఎక్కేసి అక్కడ హ్యాపీగా రిలాక్ అవుతున్నారు.

మీరందరూ కొట్టుకొని ప్రభుత్వం కూలిపోతే తాపీగ అప్పుడు వస్తాం అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి మంత్రివర్గం బాల నిరూపణకి సిద్ధమైంది. ఇక ఈ బలనిరూపణలో ఓడిపోతే ప్రభుత్వం కూలిపోతుంది.

ఇక ఈ అవకాశం కోసం కాచుకొని కూర్చున్న బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయిపోతుంది. ముంబైలో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలో విశ్వాస తీర్మానంలో పాల్గొనడానికి సిద్ధంగా లేరు. ఈ నేపధ్యంలో వారి రాజీనామాలు ఆమోదించకపోయిన అసెంబ్లీ విశ్వాస తీర్మానంలో ఓడిపోతే రాజీనామా చేయక తప్పదు. ఏ విధంగా చూసుకున్న ఈ రోజుతో కుమారస్వామి 14 నెలల పరిపాలనకి కర్ణాటకలో శుభం కార్డు పడిపోతుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న టాక్