ఛత్రపతి రీమేక్ అయిపోయిన తర్వాతే కర్ణన్ సినిమా మొదలు !

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తూ, ఎన్నో భారీ హిట్ చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాతలలో బెల్లంకొండ సురేష్ ఒకరు.అయితే బెల్లంకొండ వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ “అల్లుడు శీను” సినిమా ద్వారా తెలుగు అరంగ్రేటం చేశారు.

 Karnan Movie Starts After Chatrapathi Remake Is Over-TeluguStop.com

ప్రస్తుతం బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం ఫిట్ గా కండలు తిరిగిన బాడీతో తనను తాను రెడీ చేసుకున్నాడు.

తెలుగులో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

 Karnan Movie Starts After Chatrapathi Remake Is Over-ఛత్రపతి రీమేక్ అయిపోయిన తర్వాతే కర్ణన్ సినిమా మొదలు -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ సినిమాహిందీలో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాను హిందీలో వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మొదటిసారి హిందీ లో అడుగు పెట్టబోతున్నాడు.అంతేకాదు వివి వినాయక్ కు కూడా ఇదే మొదటి సినిమా.

ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ఈ నెలలోనే మొదలు పెట్టాలని అనుకున్నారు కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ మధ్యనే బెల్లంకొండ శ్రీనివాస్ తమిళంలో హిట్ అయినా కర్ణన్ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించాడు.అయితే ఈ సినిమా ప్రకటించడంతో ఛత్రపతి సినిమాను వాయిదా వేస్తున్నారని అంత అనుకున్నారు.

Telugu Bellamkonda Srinivas, Chatrapathi Remake, Karnan Movie Starts After Chatrapathi Remake Is Over, Karnan Remake, Vv Vinayak-Movie

అయితే అదంతా అబద్ధమేనని తేలింది.ఛత్రపతి హిందీ రీమేక్ పూర్తి చేసిన తర్వాతే శ్రీనివాస్ కర్ణన్ తెలుగు సినిమా రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసారు.ఇంకా కరోనా తగ్గుముఖం పట్టగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతారని సమాచారం.ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్ కూడా వేసినట్టు టాక్.ఈ సినిమా పూర్తి అవ్వగానే కర్ణన్ రీమేక్ లో శ్రీనివాస్ నటిస్తారని తెలుస్తుంది.

#VV Vinayak #KarnanMovie #Karnan Remake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు