అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం,విషయం ఏంటంటే

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు లు ఉండడం తో మందు బాబులు గత 45 రోజులుగా మద్యం జోలికి వెళ్లకుండా ఉక్కబట్టి ఉన్నారు.అయితే తాజాగా లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా మద్యం షాపులు తెరవడానికి అవకాశం కల్పించడం తో ఇక మందుబాబులు మద్యం షాపుల ముందు క్యూలు కడుతున్నారు.

 Telangana, Lock Down, Karimnagar, Sirisilla, Mancherial District, Wine Shop, Pen-TeluguStop.com

అయితే కొంతమంది లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం షాపుల వద్ద దర్శనమిస్తుండడం తో అధికారులు వారిపై కొరడా ఝళిపిస్తున్నారు కూడా.మొన్నటికి మొన్న తెలంగాణా ల్ని సిరిసిల్ల జిల్లా లో మాస్క్ లేని వ్యక్తికి మద్యం అమ్మినందుకు ఒక వైన్ షాపు యజమానికి రూ.5 వేల జరిమానా విధించగా,మాస్క్ లు ధరించకుండా రోడ్డుపై తిరుగుతున్నవారికి మంచిర్యాల జిల్లా లో పోలీసులు రూ.1000 ఫైన్ వేసిన విషయం తెలిసిందే.
లాక్ డౌన్ నిబంధనలను అమలు పరుస్తూనే అధికారులు మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించారో వారిపై కొరడా ఝళిపిస్తూనే ఉన్నారు.అయితే ఇవన్నీ పక్కన పెడితే, కరీంనగర్ జిల్లా లోని ఒక గ్రామం లో మాత్రం మద్యానికి దూరంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కాట్ర‌ప‌ల్లి గ్రామం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది.

త‌మ గ్రామంలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను పూర్తిగా నిషేదించింది.లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌తో మ‌ద్యం షాపులు తిరిగి తెరుచుకున్నప్పటికీ కాట్ర‌ప‌ల్లి పంచాయ‌తీలో మాత్రం మ‌ద్యం అమ్మ‌కాలు నిషేధించారు.ఒకవేళ పంచాయ‌తీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎవ‌రైనా మ‌ద్యం విక్ర‌యిస్తే వారికి రూ.10 వేల జ‌రిమానాతో పాటు సంక్షేమ ప‌థ‌కాలు నిలిపివేస్తామ‌ని గ్రామ పెద్ద‌లు హెచ్చ‌రించడం అక్కడి ప్రజలు మద్యం జోలికి వెళ్ళడానికి కొంత జంకుతున్నారు.

అంతేకాకుండా న‌ల్లా క‌నెక్ష‌న్ కూడా తొల‌గిస్తామ‌ని హెచ్చరించడం తో అక్కడ ప్రజలను మద్యం షాపులకు వెళ్లకుండా గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.అయితే గ్రామ పెద్ద‌లు తీసుకున్న ఈ అనూహ్య నిర్ణ‌యాన్ని ఊరంతా మైక్ ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube