ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో ఈ పంచాయితీ ఏంటీ సామీ.. ??

ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు సొంత లాభం కోసం శ్రమిస్తున్న విషయం తెలిసిందే.వారేగనుక నిజాయితీగా తమ పాలన సాగిస్తే నేడు ప్రజలకు ఇన్ని తిప్పలు, కష్టాలు ఉండేవి కావు.

 Karimnagar, Corporation, Meeting, Conflict,karimnagar Corporation Meeting In Col-TeluguStop.com

ఇక అప్పుడప్పుడు పాలకవర్గ సమావేశాలను ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం నిర్వహించే నాయకులు అక్కడికి వెళ్లినాక ఇవన్ని మరచిపోయి.సమస్యలన్నీ గాలికి వదిలేసి అనవసరమైన చర్చలతో సమయాన్ని వృధాచేయడం తరచుగా జరుగుతున్న తంతు.
అక్కడ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలపడం.వారిని నిలువరించేందుకు అధికార పక్ష సభ్యులు ప్రయత్నించడం.చివరికి సభ వాయిదా వేయడం.మొత్తానికి ఆ సమావేశం గందగోళంగా మారడం రివాజుగా మారింది.

ఇకపోతే బుధవారం కరీంనగర్లో కార్పొరేషన్ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రారంభమైంది.ఈ సందర్భంగా మర్రి భావన అనే కార్పొరేటర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
తన డివిజన్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోయాయని మేయర్‌కు చూపిస్తూ, మండిపడ్డారు.ఈ మాటల యుద్ధం చివరికి బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదానికి దారితీసింది.

ఇలా ఇరు పార్టీ నాయకుల మధ్య వాదోపవాదాలతో సమయం వృధాగా గడిచి పోయిందట.వీరి తీరు చూస్తే ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో ఈ పంచాయితీ ఏంటీ సామీ అని అనిపిస్తుంది కదా.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube