ఆడియో లీక్ ఎఫెక్ట్.. దెబ్బకు కలెక్టర్ బదిలీ

కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.జిల్లా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలెక్టర్‌ విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది.

 Karimnagar Collector Sarfaraj Ahmad Transferred-TeluguStop.com

కాగా మరో కారణంగా ఎంపీ సంజయ్ ఆడియో లీక్ అని అధికార వర్గాలు అంటోన్నాయి.

గతంలో ఎంపీ సంజయ్‌తో సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్‌‌తో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కలెక్టర్ పనిచేస్తున్నారంటూ మంత్రి గంగుల కమలాకర్ అప్పట్లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌కు ఆయన ఫిర్యాదు చేశాడు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ సర్ఫరాజ్ వివరణ కూడా ఇచ్చారు.

కాగా తాజాగా ఆయన్ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

దీంతో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న కే శశాంకను కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.

ఆడియో లీక్ కారణంగానే సర్ఫరాజ్ అహ్మద్‌పై బదిలీ వేటు పడిందని అధికార వర్గాలు గుసగుసలాడుతున్నాయి.మరి దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube