ఒకప్పుడు కార్గిల్ వీరుడు.... ఇప్పుడు విదేశీ నేరస్తుడు

దేశ భద్రత కోసం 30 సంవత్సరాలు ఆర్మీలో పని చేసిన ఓ వీర జవాన్ కి ఇప్పుడు ఘోర అవమానం ఎదురైంది.కార్గిల్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఇప్పుడు భారతదేశం పౌరసత్వం లేకుండా పోయింది.

 Kargil War Veteran Declared A Foreigner-TeluguStop.com

దేశ రక్షణ కోసం ఏకంగా 30 సంవత్సరాల పాటు సేవలందించిన మహ్మద్ సన్నావుల్లా అనే ఓ సైనికాధికారికి చేదు అనుభవం ఎదురైంది.ఈఎంఈ శాఖ‌లో అధికారిగా చేరిన స‌నావుల్లాకు 2014లో రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది.

కానీ ఇప్పుడు అతను అస్సాం ప్రభుత్వం వన్ అక్రమ వలసదారుల జాబితాలో చేరి అక్రమంగా ఇండియా లో ఉన్నాడు అని అభియోగాలతో అరెస్టు చేశారు.అతనిని దేశం విడిచి వెళ్లాలి అంటూ గతంలో హెచ్చరించిన నేపథ్యంలో సన్నావుల్లా తన పౌరసత్వంపై గౌహతి హైకోర్టును ఆశ్రయించాడు.

ఇదే లో ఉంటే కామరూప్ జిల్లాలో కోలాహికాష్ గ్రామానికి చెందిన స‌నావుల్లాను ఫారిన‌ర్స్ ట్రిబ్యున‌ల్ అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది.దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి ఖైదు చేసారు.

అక్రమంగా దేశంలో ఉంటున్న విదేశీయుడుగా అతని మీద అభియోగాలు మోపారు.ప్రస్తుతం స‌నావుల్లా బోర్డర్ పోలీస్ శాఖ‌లో ఇన్‌స్పెక్టర్‌గా ప‌నిచేస్తున్నారు.2008లో త‌యారైన ఓట‌రు లిస్టులో స‌నావుల్లా విదేశీయుడిగా నమోదు కావడంతో ఇప్పుడు ఇదంతా వచ్చింది.మొత్తానికి రాష్ట్రపతి అవార్దు కూడా పొందిన ఓ సైనికుడుకి దేశంలో ఎంత గౌరవం ఉందో ఈ సంఘటనతో అర్ధమవుతుంది.

ఇప్పుడు ఇతని అరెస్ట్ వార్త సోషల్ మీడియాలో ప్రముఖంగా రావడంతో దేశ వ్యాప్తంగా అతనికి మద్దతుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube