పాత్రం కోసం ఎంతైనా కష్టపడటం సిసలైన నటుల లక్షణం.అలాంటివారే సినిమా ఇండస్ట్రీ లో మన్ననలు పొందుతారు.
ఈ కష్టపడే తత్త్వం వల్లే దశాబ్ద కాలం బాలివుడ్ ని ఏలింది కరీనా కపూర్.వివాహం చేసుకున్నా కుడా పెద్ద సినిమాలు, ఐటం సాంగ్స్ చేయడం కేవలం కరీనా కే చెల్లింది.
ఆమీర్,సల్మాన్ లాంటి అగ్ర కథానాయకుల చిత్రాల్లోనే కాదు, ఇమ్రాన్, అర్జున్ లాంటి కుర్ర హీరోల సరసన కుడా ఆడిపాడుతోంది కరీనా.
విషయంలోకి వెళ్తే అర.బల్కి దర్శకత్వంలో ” కి కా ” అనే చిత్రం చేస్తోంది కరీనా.అర్జున్ కపూర్ కథానాయకుడు.
తెగ కష్టపదుతోందంట కరీనా ఈ చిత్రం కోసం.ఇటివలే చిత్రీకరించిన ఓ కీలక సన్నివేశంలో డైలాగ్ మాడ్యులేషన్ హై పిచ్‌లో ఉండటంతో ఏ మాత్రం తగ్గకుండా సీన్ ని రక్తి కట్టించింది కరీనా.
తన గొంతు కుడా దెబ్బ తినిదంట.కరీనా పట్టుదలను మెచ్చుకోక తప్పదు.