చిన్నకొడుకు ఫోటో షేర్ చేసిన కరీనా .. నెటిజన్లు ఏమన్నారంటే..?

స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ ఏడాది ఫిబ్రవరి నెల 21వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.2012 సంవత్సరంలో సైఫ్ అలీఖాన్ ను కరీనా కపూర్ ప్రేమించి వివాహం చేసుకున్నారు.2016 సంవత్సరంలో సైఫ్ కరీనా జంటకు తైమూర్ అలీఖాన్ జన్మించారు.పెద్దకొడుకు తైమూర్ కు సంబంధించిన ఫోటోలు పలు సందర్భాల్లో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

 Kareena Kapoor Second Son Photo Goes Viral In Social Media-TeluguStop.com

అయితే తాజాగా కరీనా చిన్నకొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈరోజు మదర్స్ డే సందర్భంగా కరీనా కపూర్ చిన్నకొడుకు ఫోటోను షేర్ చేశారు.

 Kareena Kapoor Second Son Photo Goes Viral In Social Media-చిన్నకొడుకు ఫోటో షేర్ చేసిన కరీనా .. నెటిజన్లు ఏమన్నారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తైమూర్ తమ్ముడిని ఎత్తుకున్న ఫోటోను కరీనా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా కరీనా ఫ్యాన్స్ ఆ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.ఆ తరువాత ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం ఒక నమ్మకం కొరకు ఎదురుచూస్తోందని తన ఇద్దరు కొడుకులు తనకు ఆ నమ్మకాన్ని ఇస్తున్నారని కరీనా పేర్కొన్నారు.

అయితే ఫోటోలో చిన్నకొడుకు ముఖం సరిగ్గా కనిపించడం లేదు.పెద్దకొడుకు తైమూర్ మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా స్టార్ హీరో అవుతాడని సైఫ్ కరీనా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కరోనా వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో కరీనా ఫ్యామిలీ ఇంటికే పరిమితమయ్యారు.పెళ్లి తర్వాత కూడా కరీనా కపూర్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

గర్భవతిగా ఉన్న సమయంలో సైతం కరీనా కపూర్ లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించారు.

కరీనా కపూర్ సోషల్ మీడియాలో కుడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమనులతో షేర్ చేసుకుంటున్నారు.

కరీనా కపూర్ నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత కరీనాకు ఆఫర్లు తగ్గినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

#Social Media #Second Son #Kareena Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు