కరీనాకపూర్ … ఇంతకు ముందు హాట్ సన్నివేశాలు చేయలేదు అని కాదు .బికినీ ట్రెండ్ ని పాపులర్ చేసిందే కరీనా, సైజ్ జీరో అనే పదాన్ని మన దేశానికి పరిచయం చేసింది బెబోనే .
అంతే కాదు ముద్దు సన్నివేశాల్లో నటించిన సినిమాలు ఎంత లేదన్నా కనీసం 15-20 ఉంటాయి .గ్లామర్ పాత్రలు అన్నేసి చేసిన కరీనా ఇక ముద్దు సన్నివేశాల్లో నటించదట .కారణం ఏమిటో తెలుసా ?
పెళ్లి అయిపోయిందిగా, ఇంకా ముద్దు సన్నివేశాల్లో నటిస్తే భర్త సైఫ్ అలీ ఖాన్ ఫీల్ అవుతాడేమో అనుకుంది ఏమో … ఇకపై ముద్దు సన్నివేశాలు చేసేది లేదు అని భీష్మించుకొని కుర్చుందట కరీనా .
కరీనా, అర్జున్ కపూర్ జంటగా ” కి కా ” అనే సినిమాలో నటిస్తున్నారు.కథానుసారం ఒక గాఢమైన చుంబన దృశ్యాన్ని రాసుకున్నాడట దర్శకుడు … అయితే దర్శకుడి ఆశలపై నీళ్ళు చల్లేస్తూ .ముద్దు సన్నివేశాలు చేయను అంటే చేయను అని గట్టిగా చెప్పేసిందట కరీనా .యూనిట్ మొత్తంలో తనే పెద్ద స్టార్ .ఇంకేం చేస్తారు .సరే అని .ముద్దు సన్నివేశాన్ని రద్దు చేసాడు డైరెక్టర్.