టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్.
ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన విషయం తెలిసిందే.గత ఏడాది విడుదల అయిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఇప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలోని నాటు నాటు( Naatu Naatu ) పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ పాటకి ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా ఈ పాట ఆస్కార్( Oscar ) అవార్డుని సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పాటే మారుమోగిపోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నాటు నాటు పాట గురించి బాలీవుడ్ నటి కరీనా కపూర్( Kareena Kapoor ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కరీనా కపూర్ హోస్ట్ గా వ్యవహారిస్తున్న వాట్ ఉమెన్ వాంట్ నాలుగ సీజన్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది.
ఇందులో కరీనా మాట్లాడుతూ ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాట గురించి మాట్లాడుతూ.
నాటు నాటు పాట చరిత్ర సృష్టించింది.ఇది రెండేళ్ల పిల్లాడి మనసుని సైతం కొల్లగొట్టింది.తన చిన్న కుమారుడు జెహ్ ( Jeh ) నాటు నాటు పాట పెడితే కానీ అన్నం తినడం లేదని, అది కూడా తెలుగులో వినడానికే ఇష్టపడుతున్నాడని చెప్పింది.
జెహ్‌కి నాటు నాటు పాట బాగా నచ్చింది.ఆ పాట వచ్చినప్పుడల్లా జెహ్ ఆనందంతో గత్తులు వేస్తున్నాడు.ఆ పాట పెడితే కానీ అన్నం తినడం లేదు.ఆస్కార్ గెలిచిన ఈ పాట.ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని కరీనా చెప్పుకొచ్చింది.