బెడ్ రూమ్ సీక్రెట్స్ చెప్పిన కరీనా.. ఆ మూడూ కావాలంటూ..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని రకాల సినిమాల్లో నటించి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కరీనా కపూర్.కరీనా నటించిన ఎన్నో సినిమాలకు అవార్డులు సైతం వచ్చాయి.

 Heroine Kareena Kapoor Reveals Her Bed Room Secrets In Coffee With Karan Show ,-TeluguStop.com

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన కరీనా కపూర్ నటనకు ఆరు ఫిలిమ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.కరీనా సినీ కెరీర్ లో ఇతర సినిమాలతో పోలిస్తే జబ్ వి మెట్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఇతర భాషల్లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

తరువాత కాలంలో కరీనా సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకోగా ఈ జంటకు రొమాంటిక్ కపుల్ గా పేరు వచ్చింది.తాజాగా ఈ జోడీ కాఫీ విత్ కరణ్ షోకు అతిథులుగా హాజరు కాగా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బెడ్ రూమ్ సీక్రెట్లను సైతం ఈ జంట ఓపెన్ గా చెప్పేయడం గమనార్హం.బెడ్ రూమ్ లో కరీనా పాతదైన టీషర్ట్ ను పైజామాను ధరిస్తుందని జుట్టును పోనీ టెయిల్ లా వేసుకుంటుందని సైఫ్ పేర్కొన్నారు.

Telugu Amir Khan, Bed Secrets, Bedroom Secrets, Karan Johar, Kareenabedroom, Kar

ఎక్కువగా తను బెడ్ రూమ్ లో నవ్వుతూ కనిపిస్తుందని సైఫ్ వెల్లడించారు.బెడ్ రూమ్ కు సంబంధించి ఎవరికీ తెలియని మూడు సీక్రెట్లు చెప్పాలని కరణ్ అడగగా బెడ్ రూమ్ లో తనకు సైఫ్ అలీ ఖాన్, వైన్ తో నిండి ఉన్న బాటిల్, పైజామా కచ్చితంగా ఉండాలని కరీనా తెలిపారు.మరోవైపు కరీనా కపూర్ చేతిలో వరుస సినిమా ఆఫర్లు ఉన్నాయి.కరీనా అంగ్రేజీ మీడియం అనే మూవీలో ఇర్ఫాన్, రాధిక మదన్ తో కలిసి నటించారు.

ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీలో సైతం కరీనానే హీరోయిన్ గా నటిస్తున్నారు.కొత్త హీరోయిన్ల నుంచి పోటీ బాగానే ఎదురవుతున్నా కరీనాకు ఆఫర్లు మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube