విజయేంద్రప్రసాద్ సీతగా మారబోతున్న కరీనా కపూర్

బాహుబలి కథారచయితగా నేషనల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి విజయేంద్రప్రసాద్.ఈ సినిమా తర్వాత హిందీలో బజరంగీ భాయ్ జాన్ సినిమాతో నేషనల్ స్థాయిలో స్టార్ రైటర్ అనే బ్రాండ్ ని విజయేంద్రప్రసాద్ క్రియేట్ చేసుకున్నాడు.

 Kareena Kapoor Plays Title Role In Vijayendra Prasad Sita, Bollywood, Sita Movie-TeluguStop.com

ఈ నేపధ్యంలో పెద్ద పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకి ఇప్పుడు అతనే రచయితగా ఉంటున్నాడు.మణికర్ణిక సినిమా స్టొరీ కూడా విజయేంద్రప్రసాద్ రాశారు.

అలాగే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ కాన్సెప్ట్ కూడా అతని నుంచి వచ్చిందే.పీరియాడికల్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే చాలా మంది ఇప్పుడు విజయేంద్రప్రసాద్ రైటింగ్ ని ఉపయోగించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా మరో ఎపిక్ స్టొరీ సిల్వర్ స్క్రీన్ పైకి వెళ్ళబోతుంది.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని మైథలాజికల్ ఎలిమెంట్ తోనే ఆవిష్కరించబోతున్నారు.

సీత (ది ఇన్కారినేషన్) అనే టైటిల్ తో హిందీలో పాన్ ఇండియా మూవీ అలౌకిక దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కనుంచి.

ఈ సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ ని కొద్దిరోజుల క్రితం సడెన్ గా రిలీజ్ చేసి అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు.

విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నాడని తెలియడంతో దీని మీద అంచనాలు క్రియేట్ అయ్యాయి.భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ సినిమాని ఆవిష్కరించబోతున్నారు.అయితే ఇందులో టైటిల్ రోల్ అయిన సీత పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేదానిపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.అయితే బిటౌన్ లో ఇప్పుడు ఈ సినిమాలో సీత పాత్ర చేయబోతున్న హీరోయిన్ గురించి ఒక అప్డేట్ వినిపిస్తుంది.

స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సీత పాత్రలో కనిపించబోతుందని టాక్ బలంగా వినిపిస్తుంది.అయితే కరీనా కపూరీ రీసెంట్ గా ఓ డెలివరీ అయ్యి బెడ్ రెస్ట్ తీసుకుంటుంది.

ఆమె కోలుకొని మళ్ళీ ఒకప్పటి లుక్ లోకి రావాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది.మరి అంత వరకు ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో ఉంచుతారా అనేది వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube