తండ్రి వల్ల అలాంటి కష్టాలు అనుభవించిన కరీనా.. ఏమైందంటే..?

సాధారణంగా సెలబ్రిటీల కూతుళ్లు అంటే ఏ లోటు లేకుండా గారాబంగా పెరుగుతారు.తల్లిదండ్రులు కూడా తాము స్టార్లుగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు.

 Star Heroine Kareena Kapoor Once Faced Typical Middle Class Crisis, Babitha, Kar-TeluguStop.com

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో గత 20 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఒక వెలుగు వెలుగుతున్న కరీనా హీరోయిన్ కాకముందు ఆర్థిక కష్టాలను అనుభవించారని సమాచారం.

కరీనా కపూర్ తండ్రి రణ్ ధీర్ కపూర్ కాగా రణ్ ధీర్ హిందీలో నటుడిగా, నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్నారు.1980 సంవత్సరంలో రణ్ ధీర్ నటించిన సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల అతనికి సినిమా ఆఫర్లు తగ్గాయి.ఆ సమయంలో పెద్దకూతురు కరిష్మా కపూర్ ను హీరోయిన్ ను చేయాలని రణ్ ధీర్ కపూర్ భార్య కరీనా కపూర్ అనుకున్నారు.

అయితే బబిత తీసుకున్న నిర్ణయం రణ్ ధీర్ కు నచ్చకపోవడంతో బబిత, రణ్ ధీర్ విడాకులు తీసుకోకుండానే విడిపోయారు.

Telugu Babitha, Kareena Kapoor, Karishma Kapoor, Middle Class, Flop, Faced, Rand

ఆ సమయంలో కరీనా కాలేజ్ కు వెళ్లడానికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ఆధారపడ్డారు.సాధారణ యువతిలా ఆమె కూడా ఆర్థిక కష్టాలను అనుభవించారు.కొంతకాలం కరీనా కష్టాలు అనుభవించిన తరువాత కరిష్మా కపూర్ హీరోయిన్ కావడంతో కుటుంబ పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో పాటు రణ్ ధీర్, బబిత కలిసిపోయారు.

ఆ తరువాత కరీనా కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

Telugu Babitha, Kareena Kapoor, Karishma Kapoor, Middle Class, Flop, Faced, Rand

ఆ తరువాత కరీనా కపూర్ ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.అయినప్పటికీ కరీనా కపూర్ మాత్రం తను పడిన కష్టాలను అంత తేలికగా మరిచిపోలేకపోయారు.రెండోసారి తల్లైన కరీనా కపూర్ ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తను అనుభవించిన కష్టాల గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube