''ముసలిదానివైపోయావు'' కరీనా ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా?

ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అభిమానులకు నేరుగా సెలబ్రిటీ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ద్వార చాలామంది సెలబ్రిటీలు వారికి వీలు దొరికినప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

 Kareena Kapoor Gets Trolled Flaunting Her Post Pregnancy Body, Kareena Kapoor, B-TeluguStop.com

ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మరింత ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.ఇలా సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత చాలా మంది అభిమానులు తమ అభిమాన నటీనటులను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తగా మరికొందరిని మాత్రం దారుణంగా ట్రోలింగ్ చేస్తుంటారు.

ఇలా ఎంతో మంది నటీనటులు నెటిజన్ల ట్రోలింగ్ కు గురైన వారు ఉన్నారని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ను నెటిజన్లు పెద్దఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.

అసలు ఈమె నెటిజన్ల చేతిలో ట్రోల్ అవ్వడానికి కారణం ఏంటనే విషయానికి వస్తే… అక్టోబర్ 10వ తేదీ లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ గ్రాండ్‌ ఫినాలే జరిగింది.ఇందులో భాగంగా పలువురు తారలు ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ సందడి చేశారు.

ఈ క్రమంలోనే కరీనాకపూర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన తెల్లటి ఫ్రాక్ ధరించి ర్యాంప్ వాక్ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈమెను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.కరీనా తన రెండవ సంతానానికి జన్మనిచ్చే కేవలం ఏడు నెలల సమయంలోనే తను ఈ విధంగా ర్యాంప్ వాక్ చేయడంతో పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.ముసలి దానివి అయిపోయావు.మీకు వయసు పైబడింది మీరు ఆ నిజాన్ని అంగీకరించాలి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు బాగా లావు అయ్యావు నాయనమ్మ.వయసు పైబడిన ఆంటీ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube