అసలు ఆ గాసిప్స్ ఎలా వస్తాయో అర్థం కాదు.. కరీనా కపూర్!

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా.ఇందులో టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.180 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.కాగా విడుదల తేదీకి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

 Kareena Kapoor Breaks Silence Rumours Around Playing Sita , Kareena Kapoor Khan, Sita, Laal Singh Chaddha, Rs 12 Crore Remuneration-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగానే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీబిజీ అయిపోయింది హీరోయిన్ కరీనాకపూర్.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనపై వచ్చిన రూమర్లపై స్పందించింది.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న రామాయణం సినిమాలో కరీనా సీత పాత్రకు ఎంపిక అయ్యిందని, అయితే ఈ పాత్ర కోసం కరీనా 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ రూమర్స్ పై స్పందించిన కరీనా.

 Kareena Kapoor Breaks Silence Rumours Around Playing Sita , Kareena Kapoor Khan, Sita, Laal Singh Chaddha, Rs 12 Crore Remuneration-అసలు ఆ గాసిప్స్ ఎలా వస్తాయో అర్థం కాదు.. కరీనా కపూర్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు, అలాంటప్పుడు నేను ఎలా డిమాండ్ చేస్తాను? ఇలాంటి వార్తలు ఎలా బయటకు వస్తాయో కూడా అర్థం కావడం లేదు.

సోషల్ మీడియా వచ్చిన తరువాత ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు కాస్త నిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుంది అంటూ కాస్త ఘాటుగా స్పందించింది కరీనాకపూర్.ఇకపోతే ఇప్పటికే లాల్ సింగ్ చందా సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగానే స్పందన లభించింది.కాగా ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు అమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధికా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube