ఆ యూట్యూబ్ ఛానెళ్లకు షాకిచ్చిన కరాటే కళ్యాణి.. పగ తీర్చుకున్నారంటూ?

కొన్నిరోజుల క్రితం కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిపై చేయి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణి ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

 Karate Kalyani Shocking Comments About Youtube Channels Details Here Karate Kalyani , Youtube Channels, Tollywood, Srikanth Reddy, Cybercrimes-TeluguStop.com

ఆ తర్వాత కరాటే కళ్యాణిపై సంచలన ఆరోపణలు వ్యక్తం కాగా కరాటే కళ్యాణి తనపై వ్యక్తమైన ఆరోపణల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు.తను ఏ తప్పు చేయలేదని కరాటే కళ్యాణి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.

అయితే అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల గురించి కరాటే కళ్యాణి సీపీఎస్ లో ఫిర్యాదు చేయడం గమనార్హం.మహిళల గురించి తప్పుగా వీడియోలు చిత్రీకరిస్తే సహించేది లేదని కరాటే కళ్యాణి కామెంట్లు చేశారు.

 Karate Kalyani Shocking Comments About Youtube Channels Details Here Karate Kalyani , Youtube Channels, Tollywood, Srikanth Reddy, Cybercrimes-ఆ యూట్యూబ్ ఛానెళ్లకు షాకిచ్చిన కరాటే కళ్యాణి.. పగ తీర్చుకున్నారంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సైబర్ క్రైమ్స్ లో కూడా వీటి గురించి ఫిర్యాదు చేసి అశ్లీల కంటెంట్ కు చెక్ పెట్టే దిశగా అడుగులు వేయాలని కరాటే కళ్యాణి కామెంట్లు చేశారు.అసభ్యంగా ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు అందరిపై కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడం గమనార్హం.

20 కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానెళ్లపై ఆధారాలతో సహా కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు.67 a, 509 సెక్షన్ల కింద పోలీసులు ఈ యూట్యూబ్ ఛానెళ్లపై కేసు నమోదు చేశారు.ఈ యూట్యూబ్ ఛానెళ్లపై పోలీసులు దృష్టి పెట్టారని త్వరలో పోలీసులు ఈ ఛానెళ్లకు నోటీసులు పంపనున్నారని సమాచారం అందుతోంది.స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ఈ కేసును పోలీసులు పరిష్కరించనున్నారని బోగట్టా.

కరాటే కళ్యాణి మీడియా ఛానెళ్లలో మాట్లాడుతూ యూట్యూబ్ లో ఉన్న అశ్లీల వీడియోలపై చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.ఇంటికి పాల ప్యాకెట్ వస్తున్న విధంగా యూట్యూబ్ లో అశ్లీల వీడియోలు వస్తున్నాయని ఆమె కామెంట్లు చేశారు.డబ్బు సంపాదనే లక్ష్యంగా అశ్లీల ప్రాంక్ వీడియోలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube