సహజీవనం చేసైనా పిల్లల్ని కంటా అంటున్న క‌రాటే క‌ళ్యాణి

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ప్ర‌స్తుతం రెండు వారాలు పూర్తి చేసుకుని.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

 Karate Kalyani Reveals Her Personal Secrets!, Karate Kalyani,  Karate Kalyani Se-TeluguStop.com

మొద‌టి వారంలో ఏడ్పుల‌తోనే గ‌డిచిపోయినా.రెండు, మూడు వారాల్లో బిగ్ బాస్ హౌస్ కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

ఇక మొద‌టి వారం స‌త్యం ద‌ర్భ‌కుడు సూర్య కిర‌ణ్ ఎలిమినేట్ కాగా.రెండో వారంలో ఊహించ‌న‌ట్టే క‌రాటే క‌ళ్యాణి దుకాణం సర్దేసింది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కొచ్చిన ఆమె ఇంటి స‌భ్యుల గురించి ఎన్నో విష‌యాలను బ‌య‌ట పెట్టింది.

త‌న‌కు బిగ్ బాస్ సీజన్ 1లోనే అవకాశం వచ్చిందని.

అయితే ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన‌ రాజా ది గ్రేట్ సినిమా వల్ల సీజన్ 1లోని ఛాన్స్‌ను వ‌దులుకున్నాన‌ని తాజాగా ఓ ఇంట‌ర్వూలో చెప్పింది క‌రాటే క‌ళ్యాణి.ఇక సీజ‌న్ 4లో ఉన్న ఇంటి స‌భ్యుల‌కు.నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంద‌ని.అదే సెట్ కాలేద‌ని తెలిపింది.

అలాగే తాను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పిన క‌రాటే క‌ళ్యాణి.నన్ను తోసేస్తే వాళ్లకు సులువు అవుతుందని టార్గెట్‌ చేశారంటూ స్ప‌ష్టం చేసింది.

ఇక వ్య‌క్తిగ‌త విష‌యాలు చెబుతూ.త‌న జీవితం ప్రేమ, పెళ్లి రెండూ క‌లిసి రాలేద‌ని తెలిపింది.అందరూ న‌న్ను మోసం చేశారు.శారీరకంగా వాడుకున్నారు.

కానీ, ఎవరూ నా కోసం కేర్ తీసుకోలేదు.ఇక పెళ్లైన ప్రతిసారి ప్రెగ్నెన్సీ రావడం.

పోవడం జరిగేది.దాంతో బిడ్డను ఎత్తుకోవాలనే నా ఆశ అలాగే ఉండిపోయిందంటూ క‌ళ్యాని వాపోయింది.

అయితే ఫ్యూచ‌ర్‌లో మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటానేమో.లేదంటే సహజీవనం చేసైనా పిల్లల్ని కనొచ్చని ముందుగానే ఓపెన్ అయిపోయింది క‌రాటే కళ్యాణి.అలాగే తాను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాన‌ని.మొద‌ట్లో పిల్లల్ని కనేందుకు ఏవో ఆరోగ్య స‌మ‌స్య‌లు అడ్డుప‌డేవ‌ని తెలిపింది.

ప్ర‌స్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాన‌ని చెప్పుకొచ్చింది క‌రాటే క‌ళ్యాణి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube