ఆ హీరోయిన్లను చెప్పుతో కొడతానంటున్న కరాటే కళ్యాణి..?  

karate kalyani reaction about bigg boss casting couch, casting couch, bigg boss show, karate kalyani interview, heroine madhavilatha - Telugu Bigg Boss, Bigg Boss Show, Casting Couch, Heroine Madhavilatha, Karate Kalyani, Karate Kalyani Interview, Karate Kalyani Reaction About Bigg Boss Casting Couch, Srireddy

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు వివాదాలు కొత్తేం కాదు.ఏ భాషలోనైనా ఈ షోను తిట్టే వాళ్లు తిడుతూ పొగిడేవాళ్లు పొగుడుతూ ఉంటారు.

TeluguStop.com - Karate Kalyani Reaction Bigg Boss Casting Couch

ఈ షోలో పాల్గొన్న వాళ్లే షోపై నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.మూడు వారాల క్రితం గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో నుంచి తొలి వారం సూర్య కిరణ్ ఎలిమినేట్ కాగా రెండో వారం కరాటే కల్యాణి ఎలిమినేట్ అయ్యారు.

ఎలిమినేట్ అయిన తరువాత ఆమె న్యూస్ ఛానెళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

TeluguStop.com - ఆ హీరోయిన్లను చెప్పుతో కొడతానంటున్న కరాటే కళ్యాణి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఇంటర్వ్యూల్లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో గతంలో శ్రీరెడ్డి, గాయత్రీగుప్తా, శ్వేతారెడ్డి, మాధవీలతలంటి హీరోయిన్లు, బిగ్ బాస్ షోపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారని.ఆ ఆరోపణలు నిజమా.? అని యాంకర్ ప్రశ్నించారు.శ్వేతారెడ్డి, మాధవీలత ఇప్పుడు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారని యాంకర్ అన్నారు.

ఆ ప్రశ్నకు సమాధానంగా కరాటే కళ్యాణి ఘాటుగా స్పందించారు.
వాళ్లను బిగ్ బాస్ షోకు తీసుకోరని.

అందువల్ల వాళ్లు ప్రతి సీజన్ కు ముందు ఇలాంటి కామెంట్లు చేస్తారని.వాళ్లకు అలాంటి అనుభవం ఎదురైందో లేదో తనకు తెలియదని.

ఈ సీజన్ లో అలాంటిది ఉందని చెబితే మాత్రం వాళ్లను చెప్పుతో కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.చేతనైతే ప్రూవ్ చేయాలని.

అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఆమె అన్నారు.
నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే తానే వాయించేదానినని.

షోలో నిజంగా క్యాస్టింగ్ కౌచ్ ఉంటే అక్కడికి వెళ్లి పరువు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.హీరోయిన్ మాధవీలత చెప్పేది ఒకటని.అక్కడ జరిగేది ఒకటని.ఎవరికో అనుభవం ఎదురైతే అందరికీ అలా జరుగుతుందని అనుకోవడం తప్పని ఆమె అన్నారు.

కొందరు కావాలని బిగ్ బాస్ షోపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

#Casting Couch #Bigg Boss #KarateKalyani #Karate Kalyani #Bigg Boss Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karate Kalyani Reaction Bigg Boss Casting Couch Related Telugu News,Photos/Pics,Images..