క‌రాటే కల్యాణి జీవితం తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వ్‌..

తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ఆదివారం సాయంత్రం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది.ఈ షోలో 12వ కంటెస్టెంట్‌గా క‌రాటే క‌ల్యాణి ఎంట్రీ ఇచ్చింది.

 Karate Kalyani Life Story,bigg Boss,contestant,karate Kalyani,nagarjuna Bigg Bos-TeluguStop.com

అచ్చ తెలుగు అమ్మాయిగా సంప్ర‌దాయంగా క‌ల్యాణి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.హ‌రిక‌థ‌ల క‌ల్యాణి అయిన ఆమె స్వ‌స్థ‌లం శ్రీకాకుళం జిల్లా కంచిలి.

ఆ త‌ర్వాత ఆమె చ‌దువు, బాల్యం అంతా విజ‌య‌న‌గ‌రంలోనే జ‌రిగింది.ఆమె జీవితం గురించి చెపుతుంటే ప్ర‌తి ఒక్క‌రికి క‌న్నీళ్లు ఆగ‌లేదు.

హ‌రిక‌థ‌ల క‌ల్యాణిగా పాపుల‌ర్ అయిన ఆమె ఆ త‌ర్వాత నాట‌క రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.నాట‌కాల్లో పాపుల‌ర్ అయ్యాక‌.

ఆమె వెండితెర‌మీద‌కు వ‌చ్చింది.

సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వ‌చ్చిన క‌ల్యాణి ర‌వితేజ హీరోగా వ‌చ్చిన కృష్ణ సినిమాలో బాబి అనే డైలాగ్‌తో పాపుల‌ర్ అయ్యింది.

ఆమె అటు వెండితెర‌తో పాటు సినిమా యూనియ‌న్ వ్య‌వ‌హారాల్లోనూ చురుగ్గా ఉంటుంది.ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే ఆమె జీవితంలో పెళ్లి అనేది క‌లిసి రాలేద‌ని వాపోయింది.

ఆమెను న‌మ్మించి చాలా మంది మోసం చేశార‌ని బిగ్‌బాస్ చూపించిన ఏవీలో భోరున ఏడ్చేసింది.ఇక ప్ర‌తి ఒక్క మ‌హిళ‌కు మాతృత్వం అనేది ఎంతో ముఖ్య‌మ‌ని.త‌న‌కు త‌న క‌డుపులో ఉన్న బిడ్డ‌తో సీమంతం చేయించుకోవాల‌న్న కోరిక ఉండేదని.అయితే త‌న‌కు పిల్ల‌ల యోగ్యం మాత్రం లేద‌ని వాపోయింది.

ఇక కొద్ది సంవ‌త్స‌రాల క్రితం ఓ అనాథ బాలుడు చెత్త‌కుప్ప‌ల్లో ఉన్నాడ‌ని తెలిసింద‌ని… ఆ వెంట‌నే తాను ఆ బాబును ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటాన్నాన‌ని క‌ళ్యాణి తీవ్ర ఉద్వేగానికి గురైంది.ఇక క‌ళ్యాణికి ఫ్యామిలీ జీవితం కూడా ఎంత మాత్రం క‌లిసి రాలేద‌ని తెలుస్తోంది.

త‌న‌ను తాను తెలుసుకోవ‌డానికే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాన‌ని.చెప్ప‌డంతో పాటు కింగ్ నాగార్జున అంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పింది.

ఇక ఫైన‌ల్‌గా ఆమె బిగ్‌బాస్‌పై త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన హ‌రిక‌థను అనుక‌రిస్తూ ఓ క‌థ చెప్పి లోప‌ల‌కు ఎంట్రీ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube