బిబి‌4: జోర్దార్ సుజాత గురించి అస‌లు నిజాలు బ‌య‌ట‌‌పెట్టిన‌ కరాటే కళ్యాణి?  

karate kalyani interest facts on jordaar sujatha! karate kalyani, jordaar sujatha, latest news, bigg boss 4, nagarjuna, bigg boss telugu - Telugu Bigg Boss 4, Bigg Boss Telugu, Jordaar Sujatha, Karate Kalyani, Latest News, Nagarjuna

సెప్టెంబ‌ర్ 6న ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ రెండు వారాలు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.మొద‌టి వారం స‌త్యం డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ ఎలిమినేట్ కాగా.

TeluguStop.com - Karate Kalyani Interesting Facts On Jordaar Sujatha

రెండో వారం ఎలిమినేష‌న్‌కు ఏకంగా తొమ్మ‌ది మంది నామినేట్ అయ్యారు.నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, గంగ‌వ్వ‌, అమ్మా రాజశేఖర్, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌లు సెల్ఫీ నామినేట్ చేసుకున్నారు.

ఈ క్ర‌మంలోనే శ‌నివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యుల‌కు ఫుల్ క్లాస్ పీకిన అనంత‌రం నాగార్జున‌.క‌రాటే క‌ళ్యాణిని ఎలిమినేట్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు.
ఇక హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణిని నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో వేదికపైకి ఆహ్వానించారు.ఈ క్ర‌మంలోనే క‌రాటే క‌ళ్యాణి జోర్దార్ సుజాత గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది.

TeluguStop.com - బిబి‌4: జోర్దార్ సుజాత గురించి అస‌లు నిజాలు బ‌య‌ట‌‌పెట్టిన‌ కరాటే కళ్యాణి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

స్టేజ్ మీద‌కు వ‌చ్చిన క‌ళ్యాణికి ఓ టాస్క్‌ ఇచ్చారు నాగార్జున‌.ఒక బోర్డుపై టాప్‌-5, బాటమ్‌-5 బ్లాక్‌లను ఇచ్చి.

ప‌క్క‌నే టేబుల్‌పై కంటెస్టెంట్ల ఫొటోలన్నీ పెట్టారు.ఆ ఫొటోలను టాప్‌-5, బాటమ్‌-5 బ్లాక్‌ల్లో అమర్చి.

కారణం చెప్పాలని నాగార్జున క‌రాటే క‌ళ్యాణికి సూచించారు.

టాప్‌ 5లో దేత్తడి హారిక, అమ్మ రాజశేఖర్‌, మోనాల్‌, దివి, అభిజిత్‌ ఫొటోలను పెట్ట‌గా.

బాటమ్‌ 5లో సోహైల్‌, సుజాత, అరియానా గ్లోరీ, కుమార్ సాయి గంగవ్వ ఫొటోలను అమ‌ర్చి.ఎందుకు పెట్టిందో కార‌ణాలు కూడా క‌ళ్యాణి.ఈ క్ర‌మంలోనే జోర్దార్ సుజాత గురించి మాట్లాడుతూ.ఆమె మనస్ఫూర్తిగా నవ్వదని.

నవ్వు నటిస్తుందని తేల్చి చెప్పింది.
సుజాతది నిజమైన నవ్వు కాదని.

తెచ్చి పెట్టుకున్న నవ్వు అని, అందుకే త‌న న‌వ్వు కాస్త ఓవ‌ర్‌గా ఉంటుంద‌ని కళ్యాణి తెలిపింది.అంతేకాదు, సుజాత‌ మంచిదాన్ని అని చెప్పుకోవడానికి ఇతరులపై ఏదో ఒకటి వేస్తుందని క‌రాటే కళ్యాణి ఖరాఖండిగా చెప్పింది.

ఇక అనంత‌రం టీవీ9 దేవీ నాగ‌వ‌ల్లిపై బిగ్ బాంబ్ వేసింది క‌ళ్యాణి.దీంతో దేవీ నామినేష‌న్‌లోకి వెళ్లింది.

#Karate Kalyani #Nagarjuna #Bigg Boss 4 #Jordaar Sujatha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karate Kalyani Interesting Facts On Jordaar Sujatha Related Telugu News,Photos/Pics,Images..