శ్రీరెడ్డిని పోలీస్ స్టేషన్ కి లాగిన కరాటే కళ్యాణి  

Karate Kalyani Complaint On Sri Reddy For Abusing Words - Telugu Abusing Words, Karate Kalyani Complaint On Sri Reddy, Tollywood

శ్రీరెడ్డి గురించి తెలుగు ప్రజలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాస్టింగ్ కౌచ్ ఇష్యూ, తరువాత పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలతో ఈ భామ తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది.

Karate Kalyani Complaint On Sri Reddy For Abusing Words

ఈమె చేసిన సినిమాలు ఏంటో అనేది తెలియకపోయినా ఇప్పుడు పెద్ద హీరోయిన్స్ కి ఉన్న స్థాయిలో సోషల్ మీడియాలో గుర్తింపు ఉంది.ఈమె బిహేవియర్ తో ఉన్న కొద్ది అవకాశాలు కూడా రాకుండా పోయాయి.

అయితే ఇప్పటికి సోషల్ మీడియాలో ఎవరో ఒకరి మీద, ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ మీద నిత్యం ఏవో ఒక ఆరోపణలు చేస్తూ మీడియా దృష్టి తన మీద ఉండేలా చూసుకుంటుంది.

అయితే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీని బూతులు తిడుతూ వీడియోలు చేసిన తనని ఆపేవారు లేకపోవడంతో ఈ మధ్యకాలంలో మరింత శృతిమించి ప్రవర్తిస్తుంది.

ఈమె నోరు తెరిస్తే బూతులు తప్ప మరేమీ రావడం లేదు.ఈమె వీడియోలపై నెటిజన్లు ఎన్ని విమర్శలు చేసిన అదే పంథాలో వెళ్తుంది.తాజాగా శ్రీరెడ్డి మీద సీనియర్ నటి కరాటే కల్యాణి మీద ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది.దీనిపై కరాటే కల్యాణి పోలీసులకి ఫిర్యాదు చేసింది.

ఆమె తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా చెప్పుకోలేని స్థాయిలో తిడుతుందని ఫిర్యాదులో పేర్కొంది.గతంలో శ్రీరెడ్డి చేసిన ఉద్యమం గురించి ఓ ఇంటర్వ్యూలో కరాటే కల్యాణి విమర్శలు చేసింది.

ఈ నేపధ్యంలోనే శ్రీరెడ్డి ఆమె మీద అసభ్యకరంగా నోరు పారేసుకుంది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

తాజా వార్తలు

Karate Kalyani Complaint On Sri Reddy For Abusing Words-karate Kalyani Complaint On Sri Reddy,tollywood Related....