మల్లీశ్వరి ఖాతాలో మరో హీరోయిన్‌ కూడా చేరింది  

Karanam Malleswari Rakul Preeth Singh - Telugu Karnuma Malleswari, Kona Venkat, Nitya Menon, Rakul Preeth Singh, Tollywood

అంతర్జాతీయ స్థాయి వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరి బయోపిక్‌ను తీస్తున్నట్లుగా రచయిత అయిన కోన వెంకట్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.ఆయన ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ను ఎవరు పోషిస్తారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

 Karanam Malleswari Rakul Preeth Singh

దాంతో గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.మొదట నిత్యామీనన్‌ను ఈ చిత్రం కోసం సంప్రదించారని ప్రచారం జరిగింది.

కాని నిత్యామీనన్‌ తాను ఆ సినిమా చేయడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చి తప్పించుకుంది.

మల్లీశ్వరి ఖాతాలో మరో హీరోయిన్‌ కూడా చేరింది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈమద్య కాలంలో బయోపిక్‌లు చేస్తూ బాలీవుడ్‌లో బాగా ఫేమస్‌ అయిన ముద్దుగుమ్మ తాప్సిని ఈ చిత్రంలో నటింపజేస్తే సౌత్‌ మరియు నార్త్‌లో సినిమాకు మంచి బిజినెస్‌ అవుతుందని మేకర్స్‌ భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె పర్సనాలిటీకి మరియు బాడీ లాంగ్వేజ్‌కు వెయిట్‌ లిఫ్టింగ్‌ అస్సలు సూట్‌ అవ్వదని అనుకున్నారట.అందుకే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రంగంలోకి దించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కోన వెంకట్‌ ఇటీవలే కరణం మల్లీశ్వరి సినిమాకు గాను రకుల్‌తో చర్చలు జరిపాడట. ఫిట్‌నెస్‌పై రకుల్‌ చాలా శ్రద్ద తీసుకుంటుంది.వెయిట్‌ లిఫ్టింగ్‌లో మెలకువలు తెలుసు.జిమ్‌ సెంటర్స్‌ను మెయింటెన్‌ చేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అయితే ఈ సినిమాకు సెట్‌ అవుతుందని భావిస్తున్నారు.ఇదే సమయంలో రకుల్‌కు బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా మంచి స్టార్‌డం ఉంది కనుక అక్కడ ఇక్కడ సినిమాకు పబ్లిసిటీ దక్కుతుందని అనుకుంటున్నారట.త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Karanam Malleswari Rakul Preeth Singh Related Telugu News,Photos/Pics,Images..

footer-test