వైసీపీలోకి వ‌చ్చినా.. క‌ర‌ణానికి టీడీపీ ముసుగు పోలేదా...?

ఎవ‌రైనా.ఎక్క‌డైనా.ఎప్పుడైనా.తామున్న ప‌రిస్థితుల‌కు అనుకూలంగా త‌మ‌ను తాము మార్చుకుంటారు. అప్ప‌టి వ‌ర‌కు తాము ఎలా న‌డిచామ‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.కొత్త గూటికి చేరుకున్నాక‌.

 Karanam Dont Take Out That Mask  Even Also He Entered In Ysrcp,tdp,ysrcp,karanam-TeluguStop.com

దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు.కానీ.

ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించిన క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి మాత్రం.దీనికి భిన్నంగా.వ్య‌వ‌హ‌రిస్తు న్నార‌ని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు.ఆయ‌న కొన్ని ద‌శాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు.ఆ పార్టీలో ఉన్న వారికి కొన్ని చిత్ర‌మైన ల‌క్ష‌ణాలు ఉంటాయి.తాము త‌ప్పు చేసినా.

బుకాయిస్తారు.ఎదుటి వారు త‌ప్పు చేయ‌క‌పోయినా.

చేసేసిన‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చేస్తారు.ఊద‌ర‌గొట్టు ప్ర‌సంగాల‌తో త‌మ్మిని బొమ్మి చేస్తారు.

ఇక‌, ఆ వెంట‌నే.తాము చేసిన త‌ప్పు.త‌మ‌మీద‌కు రాకుండా చూసుకునేందుకు అనుకూల మీడియాను రంగంలోకి దింపేస్తారు.తామే స‌ద‌రు మీడియాకు హింట్లిచ్చి.

త‌మ‌కు అనుకూలంగా ప్ర‌చారాలు చేయిం చుకుంటారు.అదే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థుల‌పై దుమ్మెత్తిపోసే ప‌క్కా ప్లాన్ అమ‌లు చేస్తారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి కింది స్థాయి నాయ‌కుల వ‌ర‌కు కూడా ఇదే కొన‌సాగుతోంద‌ని అంద‌రూ అనే మాట‌.ఇప్పుడు క‌ర‌ణం కూడా ఇదే పంథాను అనుస‌రిస్తున్నారు.

వాస్త‌వానికి ఆయ‌న కొన్నాళ్ల కింద‌ట టీడీపీ కండువాను ప‌క్క‌న ప‌డేశారు.వైసీపీలోకి చేరిపోయారు.

అయితే.ఆయ‌న మాత్రం.

టీడీపీ ఛాయ‌లు మ‌రిచిపోలేక పోతున్నారు.

Telugu Ap, Chandra Babu, Karanam, Karanam Balaram, Tdp, Ysrcp-Telugu Political N

అప్ప‌ట్లో టీడీపీలో ఉండ‌గా.ఎలా అయితే.తాను త‌ప్పులు చేసి ఎదుటి వారిపైకి నెట్టేశారో.

ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు.తాజాగా జ‌రుగుతున్న మ‌త్స్య‌కార వివాద‌మే తీసుకుంటే.

ఇక్క‌డ వివాదాన్ని రెచ్చ‌గొట్టిందే ఆయ‌న అన్న విమ‌ర్శ‌లు చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తున్నాయి.అంతేకాదు, ఈ వివాదాన్ని సానుకూలంగా ప‌రిష్క‌రించేందుకు రంగంలోకి దిగిన‌.

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీల‌క నాయ‌కుడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వ‌ర్గంపై త‌న అనుచ‌రుల‌తో ముఖ్యంగా అద్దంకి నుంచి దింపేసిన ఓ ముఠాతో దాడి చేయించార‌న్న ఆరోప‌ణ‌లు వైసీపీ వ‌ర్గాల నుంచే వినిపిస్తున్నాయి.ప్ర‌త్య‌క్ష సాక్షులు చెపుతోన్న దాని ప్ర‌కారం వాడరేవు మత్సకార బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణతో క‌లిసి ఆమంచి బ‌య‌ల్దేరారు.

మ‌త్స్య‌కారులు అమాయ‌కుల‌ని, వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న ఆమంచి.మోపిదేవిని బ్ర‌తిమాలి మ‌రీ.నియోజ‌క‌వ‌ర్గానికి తీసుకువ‌చ్చారు.అయితే.

ఈ విష‌యం తెలుసుకున్న క‌ర‌ణం కుమారుడు వెంక‌టేష్‌.వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నాల‌ను అడ్డుకుని వారి అనుచరులను ఉసిగొల్పారు.

దీంతో అద్దంకి ముఠా.ఒక్క‌సారిగా ఆమంచి అనుచ‌రుల‌పై కర్రలతో దాడికి దిగి తలలు పగులకొట్టారు.

ఈ దాడిలో ఇద్ద‌రు ఆమంచి అనుచ‌రులు తీవ్రంగా గాయ‌ప‌డి ప్రాణాపాయ ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు.

మ‌రి ఇంత చేసిన క‌రణం గ్యాంగ్ త‌న టీడీపీ ముద్ర‌ను బ‌య‌ట‌కు పెట్టుకుంటూ.

వెంట‌నే త‌మ అనుకూల మీడియాకు స‌మాచారం ఇచ్చేసి.త‌మ వ‌ర్గంపైనే ఆమంచి దాడి చేయించారంటూ.

క‌ల‌రింగ్ క‌థ‌లు ప్ర‌చారం చేయించుకున్నారు.దీంతో వివాదం మ‌రింత పెరిగింది.

మ‌రి ఆయ‌న ఇక్క‌డ త‌లెత్తిన వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని అనుకున్నారా?  లేక‌.పెంచాల‌ని అనుకున్నారా? అనేది ప్ర‌శ్న‌.ఏదేమైనా.వైసీపీలోకి వ‌చ్చినా.క‌ర‌ణానికి టీడీపీ ముసుగు పోలేదా? అని ప్ర‌జ‌లే ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube