స్టార్ యాంకర్ కు చంపుతామంటూ బెదిరింపులు.. ఏమైందంటే..?

హిందీలో బుల్లితెర స్టార్ యాంకర్ గా గుర్తింపును సంపాదించుకున్న వారిలో కరణ్ వాహి ఒకరు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే కరణ్ వాహీకి భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

 Karan Wahi Receives Death Threats Over Post Kumbh Mela, Comments Viral, Karan Wa-TeluguStop.com

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.ఒక అంచనా ప్రకారం హరిద్వార్ లో బైసాకీ స్నానం ఆచరించడానికి దాదాపు 6 లక్షల మంది భక్తులు హాజరైనట్టు తెలుస్తోంది.

కరోనా విజృంభిస్తున్న సమయంలో లక్షల సంఖ్యలో ప్రజలు కుంభమేళాకు హాజరు కావడంపై కరణ్ వాహి వ్యంగ్యంగా స్పందించారు.నాగ బాబాల సాంప్రదాయానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదా అంటూ కరణ్ కామెంట్ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గంగా జలంతో స్నానం ఆచరించడం అవసరమా.? అని ప్రశ్నించారు.అయితే గంగా జలం స్నానం ఆచరించే విషయంలో కరణ్ చేసిన కామెంట్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక మతం సాంప్రదాయాలను దెబ్బ తీసే విధంగా కరణ్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

కొంతమంది నెటిజన్లు కరణ్ వాహిని చంపేస్తామంటూ బెదిరించగా మరి కొంతమంది నెటిజన్లు మాత్రం కరణ్ వాహి పెట్టిన పోస్ట్ ను వెంటనే డిలేట్ చేయాలంటూ కోరుతున్నారు.తనకు చాలా బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని కరణ్ పేర్కొన్నారు.

హిందువులు అయినంత మాత్రాన కరోనా నిబంధనలను గాలికి వదిలేయాలా.? అని ప్రశ్నించారు.

Telugu Commetns, Karan Wahi, Kumbh Mela-Movie

నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ముందు అసలైన హిందువుకు అర్థం తెలుసుకోవాలని నెటిజన్లకు కరణ్ సూచించారు.కరణ్ వాహి పోస్టుల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కరణ్ వాహీ ప్రజల మంచి కోసమే చెప్పినా చెప్పిన విధానం సరిగ్గా లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కరణ్ వాహీ పోస్టులను డిలేట్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube