డిప్రెషన్ లో కరణ్ జోహార్... కీలక పదవికి రాజీనామా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ పెద్ద రచ్చ నడుస్తుంది.సుశాంత్ మరణానికి కారణం మీరే అంటూ కాంగనాతో పాటు కొంతమంది సెలబ్రెటీలు బాలీవుడ్ సెలబ్రెటీ వారసుల మీద దాడి చేస్తున్నారు.

 Karan Johar To Resign From Mami Board-TeluguStop.com

అలాగే బాలీవుడ్ లో వారసత్వ నటులని ప్రోత్సహిస్తూ కొత్తవాళ్లకి అవకాశాలు రాకుండా కరణ్ జోహార్ అడ్డుకుంటున్నాడు అంటూ అతనిని ట్రోల్ చేస్తున్నారు.ఈ రచ్చ చాలా తీవ్ర స్థాయిలో బాలీవుడ్ లో నడుస్తుంది.

ఈ ట్రోలింగ్ ధాటికి వారసత్వంతో వచ్చిన నటులు అందరూ సైలెంట్ అయిపోయారు.మరోవైపు సుశాంత్ మరణాన్ని తట్టుకోలేపోతున్న వారు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ సినిమాలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తునానరు.

 Karan Johar To Resign From Mami Board-డిప్రెషన్ లో కరణ్ జోహార్… కీలక పదవికి రాజీనామా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అందరూ తనని టార్గెట్ చేయడంతో కరణ్ జోహార్ ఇప్పడు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది.

ఇంత మంది తనని టార్గెట్ చేసిన కూడా తాను ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ వారసులు తనకి అండగా నిలబడలేదని, కనీసం తనకి మద్దతిస్తూ ఎలాంటి వాఖ్యలు చేయడం లేదని కరణ్ ఆవేదనతో ఉన్నారని బీటౌన్ లో వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో చాలా మంది సెలబ్రెటీలని తన ట్విట్టర్ లో ఆన్ ఫాలో చేసేసారు.ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎంఏఎంఐ బోర్డు పదవి కూడా కరణ్ రాజీనామా చేశాడు.ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారింది.

కరణ్ ఎందుకు ఉన్నపళంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చర్చించు కుంటున్నారు.

#SushantSingh #KaranJohar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు