25 ఏళ్లలో వర్మ వంటి మంచి మనిషిని చూడలేదట

రామ్‌ గోపాల్‌ వర్మ పేరు వింటేనే ఏదో ఒక వివాదంతో మళ్లీ మీడియాలో వచ్చి ఉంటాడు అంటూ జనాలు అనుకునే పరిస్థితి వచ్చింది.గతంలో అద్బుతమైన సినిమాలను తెరకెక్కించి మంచి దర్శకుడిగా పేరు దక్కించుకుని అలా వార్తల్లో నిలిచిన వర్మ ఇప్పుడు చెత్త సినిమాలు చేస్తూ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో మీడియా ముందు ఉండటం వల్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 Karan Johar Ram Gopal Varma-TeluguStop.com

వర్మను ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు.ఆయన అభిమానులు కూడా ఆయన తీరుపై ఈమద్య అసహనంతో ఉన్నారు.

ఎంతో మందితో తిట్టించుకుంటున్న రామ్‌ గోపాల్‌ వర్మ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌తో మాత్రం పొగిడించుకున్నాడు.ఇటీవల కరణ్‌ జోహార్‌ నిర్మించిన భూత్‌ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది.

ఆ కార్యక్రమంలో కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ వర్మ వంటి మంచి వ్యక్తిని తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో చూడలేదు అంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.గతంలో వీరిద్దరి మద్య విభేదాలు ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

కాని తాజాగా కరణ్‌ అలాంటి వ్యాఖ్యలు చేసి మరింత చర్చకు తెరలేపాడు.

Telugu Verma, Karan Johar, Ram Gopal Varma, Telugu Ups-

కరణ్‌ జోహార్‌ తాజా చిత్రం కోసం భూత్‌ టైటిల్‌ కావాల్సి వచ్చింది.అది వర్మ గతంలో తీసిన సినిమా టైటిల్‌.దాన్ని వినియోగించుకోవాలి అంటే వర్మ పర్మీషన్‌ కావాల్సి ఉంటుంది.

అందుకోసం వర్మను సంప్రదించగా వెంటనే ఒప్పుకున్నాడట.భూత్‌ మాత్రమే కాకుండా తన సినిమా టైటిల్‌ ఏది అయినా వాడుకోవచ్చు అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట.

ఇలాంటి మంచి మనసు కొందరికే ఉంటుందని వర్మపై కరణ్‌ కామెంట్స్‌ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube