త్వరలో పట్టాలెక్కనున్న ప్రముఖ క్రికెటర్ బయోపిక్...  

Karan Johar Green Signal To The Sourav Ganguly Biopic - Telugu Bollywood, Sourav Ganguly And Karan Johar News, Sourav Ganguly Biopic News, Sourav Ganguly Latest News, Sourav Ganguly News

ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో బయోపిక్ హవా నడుస్తోంది.ఇప్పటికే సంజు, మేరీ కోమ్, వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.

Karan Johar Green Signal To The Sourav Ganguly Biopic - Telugu Bollywood And News Latest

అంతేగాక టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో అలనాటి అందాలతార మరియు విలక్షణ నటి మహానటి సావిత్రి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కినటువంటి “మహానటి” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఐతే ఇదే తరహాలో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, జార్జిరెడ్డి చిత్రాలు కూడా పర్వాలేదనిపించాయి.

అయితే తాజాగా ప్రముఖ క్రికెటర్ బయో పిక్ ని కూడా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

అయితే  ఇంతకీ ఈ బయోపిక్ ఎవరిదని అనుకుంటున్నారా…? బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీది.అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు   దాదా సౌరవ్ గంగూలీ బయోపిక్ ని తెరకెక్కించేందుకు ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ ని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక ఇప్పటికే దర్శకుడు పలు ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు సౌరవ్ గంగూలీని కూడా సంప్రదించి కథాంశాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

దీంతో అన్ని కుదిరితే వచ్చే నెలలో ఈ చిత్రం పట్టాలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా పలుమార్లు సౌరవ్ గంగూలీ తన బయోపిక్ గురించి స్పందిస్తూ తన బయోపిక్ లో తన పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేస్తే చాలా బాగుంటుందని పలుమార్లు అభిప్రాయపడ్డాడు.దీంతో దర్శకుడు కూడా హృతిక్ రోషన్ ను గంగూలీ బయోపిక్ లో నటింపజేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.అంతేగాక కరణ్ జోహార్ ఈ చిత్రానికి సంబంధించి నటువంటి వివరాలను తొందర్లోనే వెల్లడించనున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి మేరీ కోమ్, ఎంఎస్ ధోని, సచిన్, తదితరులు బయోపిక్ లు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.అంతే గాక ప్రస్తుతం స్టార్ బ్యాడ్మింటన్ షట్లర్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా నటిస్తోంది.

తాజా వార్తలు

Karan Johar Green Signal To The Sourav Ganguly Biopic-sourav Ganguly And Karan Johar News,sourav Ganguly Biopic News,sourav Ganguly Latest News,sourav Ganguly News Related....