తండ్రి కలని నిజం చేస్తున్నకరణ్ జోహార్!  

తండ్రి కలని నిజం చేస్తున్న కరణ్ జోహార్, కళంక్ సినిమా టీజర్ రిలీజ్. .

  • బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా, దర్శకుడుగా తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి కరణ్ జోహార్. కరణ్ జోహార్ బ్యానర్ ధర్మా ప్రొడక్షన్ నుంచి సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది కచ్చితంగా హిట్ అనే అభిప్రాయం ఆడియన్స్ లో వుంటుంది. అలాంటి బ్రాండ్ వేల్యూతో కరణ్ జోహార్ సినిమాలు నిర్మిస్తున్నాడు. ఓ వైపు ఎంటర్టైన్మెంట్, మరో వైపు భారీ కమర్షియల్ చిత్రాలు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ తెరపై భారీ మల్టీ స్టారర్ చిత్రం బ్రహ్మాస్త్రని నిర్మించే పనిలో కరణ్ బిజీగా వున్నాడు.

  • ఇదిలా వుంటే తాజాగా ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన కళంక్ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బాహుబలి స్టాండర్డ్స్ పీరియాడికల్ డ్రామాగా స్వాతంత్ర్య ఉద్యమానికి పూర్వం భారతీయ నాగరికత, సంప్రదాయాల ఇతివృత్తంగా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కాబోతుంది. భారీ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్, అలియా బట్ కీలక పాత్రలలో నటించారు. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పరవాలేదని, ఈ సినిమాకి తాను డబ్బుల కోసం తీయలేదని, ఇది తన తండ్రి డ్రీం ప్రాజెక్ట్ అని, అందుకే దీనిని సెట్స్ పైకి ఎక్కించినట్లు చెప్పారు.