రౌడీ కోసం బాహుబలి నిర్మాత సై  

Karan Johar Deal Set With Puri Jagannadh For Vijay Devarakonda-fighter,karan Johar,puri Jagannadh,vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ యూత్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.కాగా విజయ్ దేవరకొండ ఇటీవల క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే.

Karan Johar Deal Set With Puri Jagannadh For Vijay Devarakonda-fighter,karan Johar,puri Jagannadh,vijay Devarakonda Telugu Tollywood Movie Cinema Film Latest News-Karan Johar Deal Set With Puri Jagannadh For Vijay Devarakonda-Fighter Karan Puri Devarakonda

ఈ కాంబో అనగానే టాలీవుడ్‌లో అంచనాలు పెరిగిపోయాయి.

అయితే ఈ కాంబో కేవలం టాలీవుడ్ జనాలనే ఎంటర్‌టైన్ చేయబోదట.

విజయ్ దేవరకొండతో పూరీ తెరకెక్కించనున్న సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్‌ను అనుకుంటున్న పూరీ ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ దీనికి సంబంధించి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌తో తాజాగా చర్చలు కూడా జరిపిందట.

పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని కరణ్ జోహార్‌తో కలిసి వారు బాలీవుడ్‌లో కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించేందుకు పూరీ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

కరణ్ జోహార్ కూడా ఈ సినిమాలో నిర్మాతగా వ్యవహరిస్తారనే విషయాన్ని కూడా వారు అతి త్వరలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే పూరీ అండ్ కో అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు

Karan Johar Deal Set With Puri Jagannadh For Vijay Devarakonda-fighter,karan Johar,puri Jagannadh,vijay Devarakonda Related....