ఆ ఆధ్యాత్మిక వేత్త బయోపిక్ తెరపైకి... కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో

ఈ మధ్యకాలంలో బయోపిక్ ల ట్రెండ్ జోరుగా సాగుతుంది.ఇప్పటికే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో చాలా మంది బయోపిక్ లు వచ్చేశాయి.

 Karan Johar Announces Film On Sri Sri Ravi Shankar Biopic-TeluguStop.com

మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.మన హైదరాబాదీ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా తెరపైకి వెళ్తుంది.

తాప్సి టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే స్పోర్ట్స్ స్టార్స్ అయిపోయిన తర్వాత విద్యావేత్తలు, ప్రముఖుల జీవితాలని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు.

 Karan Johar Announces Film On Sri Sri Ravi Shankar Biopic-ఆ ఆధ్యాత్మిక వేత్త బయోపిక్ తెరపైకి… కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అర్షద్ మెహతా కుంభకోణం నేపధ్యంలో బిగ్ బుల్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.ఇక ప్రముఖుల జాబితా ఇప్పుడు ఆధ్యాత్మికంవైపు వెళ్ళింది.

బాలీవుడ్ దర్శకులు ఇప్పుడు ఆధ్యాత్మిక వేత్తల బయోపిక్ లు కూడా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇండియాలో ఆధ్యాత్మిక గురువుగా ఫేమస్ అయిన గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జీవిత కథని తెరపై ఆవిష్కరించబోతున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని చిత్ర యూనిట్ ఆవిష్కరించింది.ఈ సినిమాకి ఫ్రీ అనే టైటిల్ ని పెట్టారు మాంటో బస్సి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు.ప్రజల్లో పాజిటివిటీ పెంచాలనే ఉద్దేశ్యంతోనే శ్రీశ్రీ రవిశంకర్ బయోపిక్ ని తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఇక ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 21 బాషలలో 100 దేశాలలో రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు.మొత్తానికి ఈ సినిమాని ఇండో హాలీవుడ్ రేంజ్ మూవీగా కరణ్ జోహార్ ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరి దీనిని డాక్యుమెంటరీగా తయారు చేస్తారా లేదా శ్రీశ్రీ రవిశంకర్ పాత్రలో ఎవరైనా నటుడుని తీసుకొని బయోపిక్ జోనర్ లోనే ఆవిష్కరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

#SriSri #Karan Johar #Biopic Trend #Spiritual Guru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు