జగన్ కి కాపులు ఝలక్ ఇవ్వనున్నారా..?       2018-05-02   01:07:53  IST  Bhanu C

జగన్మోహన్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు..సీఎం కుర్చీ కోసం నిద్రాహారాలు మానేసి,కుర్చీనే పరామావధిగా జగన్ చేసే పాదయాత్ర అరువు తెచ్చుకున్న జనాలతో ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తోంది..జగన్ తాజా వ్యూహాలతో ఏపీలో ఒక బలమైన వర్గానికి దూరం అయిపోయారు అని అంటున్నారు విశ్లేషకులుని..ఇది జగన్ తెలిసి చేశాడా తెలియకుండా చేశాడా లేకా వ్యుహత్మాక తప్పిదమా అనే వివరాలలోకి వెళ్తే..

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌తో హోదాను ప్ర‌చార అస్త్రంగా మార్చుకున్న జగన్ ఒక పక్కా వ్యూహంతో రాజకీయాలు చేస్తున్నారు..175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ముందు తిర‌గ‌టం.. వీల‌య్యే ప‌నికాదు. అందుకే సెంటిమెంట్ ను ఇలా వ‌ర్క‌వుట్ చేసుకున్నాడు…అయితే.. కృష్ణాజిల్లాను ఎన్‌టీఆర్ జిల్లాగా మార్చుతాన‌ని ప్ర‌క‌టించి.. క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌కు గాలం వేయాల‌ని వేసిన జగన్నాటకానికి అసలు ముందు ముందు ఎలాంటి పరిస్థితులని ఎదుర్కోవాల్సి ఉంటుందో జగన్ అంచనా వేయలేకపోయాడా..?

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు, క‌మ్మ కులాల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు కావ‌చ్చు.. గ‌తం నుంచి వ‌స్తున్న వైరం వ‌ల్ల‌గానీ.. ఇద్దరికీ చాలా గ్యాప్ అయితే ఉంది అందులోనూ కృష్ణాజిల్లాలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య నాలుగు ద‌శ‌బ్దాలుగా వంగ‌వీటి వ‌ర్సెస్‌ దేవినేని కుటుంబాల మ‌ధ్య ర‌క్త‌చ‌రిత్ర ప్రతీ ఒక్కరికీ తెలిసిందే అలాంటి చోట ఒక వర్గానికి చెందిన కీలక ప్రకటన చేయాలి అంటే ఎంతో సాహసం,తెగువా,తెలివితేటలు ఉండాలి..కానీ జగన్ కి ఈ మూడు లేక మూర్ఖత్వం ఉండటం ఇప్పుడు కాపు వర్గానికి దూరం చేస్తోంది.

ఇప్ప‌టికే వంగ‌వీటి రాధాకృష్ణ‌, గౌతంరెడ్డి మ‌ధ్య గొడ‌వ తారాస్థాయికి చేరింది. ఇప్ప‌టి వర‌కూ వైసీపీ కాపుల‌కు ప్రాధాన్య‌త ఇస్తుంద‌నే సానుభూతి ఒక్క దెబ్బకు ప‌టాపంచ‌లైంది. ఇదే స‌మ‌యంలో మ‌రోసారి కృష్ణాజిల్లా పేరుతో వివాదం తారాస్థాయికి చేరింది.. అటు క‌మ్మ వ‌ర్గం కూడా.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నపై ప్ర‌తికూలంగానే స్పందించారు. టీడీపీ నేత‌లైతే.. అంత‌టి మ‌హ‌నీయుడిని.. కేవ‌లం ఎన్నిక‌ల ప్ర‌చారానికే జ‌గ‌న్ వాడుకుంటున్నాడ‌ని ఫైర్ అవుతున్నారు..రెంటికీ చెడిన రేవడిలా జగన్ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది ఈ సమయంలో ఎలాగో కమ్మ ఓట్లు పడవు ఈ ప్రకటన చేసి కాపు ఒట్లకి కూడా జగన్ దూరం అయ్యాడు అంటున్నారు విశ్లేషకులు.