ప‌వ‌న్‌ను భ‌రించ‌లేక‌పోతోన్న కాపులు... అందుకే దూర‌మ‌వుతోన్నారా...!

రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగిసిప‌డుతుంద‌ని, కుదిరితే .అదికారంలోకి కూడా వ‌చ్చేస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృ త్వంలోని జ‌న‌సేన పార్టీ ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌చందంగా ఉండ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 Kapus Can't Bear The Pawan Kalyan ... So They Are Moving Away ,kapu, Caste, Paw-TeluguStop.com

పోనీ.ఇత‌ర సామాజిక వ‌ర్గాల ప‌రిస్థితి ఎలా ఉన్నా.

త‌న సొంత సామాజిక వ‌ర్గంలోనూ ప‌వ‌న్ ప‌ట్టు సాధించ‌లేక పోవ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారిం ది.ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యాన్ని తీసుకుంటే.పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.వివిధ సామాజిక వ‌ర్గాల్లో పార్టీకి ప‌ట్టున్నా లేకున్నా. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి పార్టీ అదినేత చంద్ర‌బాబుపై మంచి న‌మ్మ‌కం ఉంది.పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయినా.

క‌మ్మ నేత‌లు బాబుపై న‌మ్మ‌కం పోకుండా చూసుకున్నారు.

ఇక‌, రెడ్డి సామాజిక వ‌ర్గం.

త‌మ‌కు ఏం జ‌రిగింద‌నేది చూడ‌కుండా.వైసీపీ అధికారంలోకి వ‌చ్చేవ‌ర‌కు పోరాడారు.

పార్టీ అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా త‌మ‌కు పెద్ద‌గా ప‌ద‌వులు ల‌భించినా.ల‌భించ‌క‌పోయినా.

జ‌గ‌న్ వెంటే ఉన్నారు.అంటే.

ఈ రెండు పార్టీల్లోనూ సామాజిక వ‌ర్గాల వారీగా చూసుకుంటే. క‌మ్మ‌, రెడ్డి వ‌ర్గాలు ఎక్క‌డా న‌మ్మ‌కం కోల్పోలేదు.

కానీ, ప‌వ‌న్ విష‌యంలో మాత్రం యూట‌ర్న్ రాజ‌కీయాలు సాగుతున్నాయ‌ని అంటున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు.ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం.

కాపులు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒకింత ప‌వ‌న్ వైపు మొగ్గు చూపారు.

Telugu Central, Janasainiks, Janasena, Janasenani, Kapu, Pawan Kalyan-Telugu Pol

అయితే.జ‌గ‌న్ సునామీ నేప‌థ్యంలో ఆయ‌న గెలుపు ప్ర‌శ్నార్థ‌మైంది.పార్టీ అధికారంలోకి కాదు క‌దా.

క‌నీసం ప్ర‌తిప‌క్షం హోదాను కూడా ద‌క్కించుకోలేక పోయింది.అంత‌మాత్రాన సొంత సామాజిక వ‌ర్గాన్ని చేరువ చేసుకునే ప్ర‌య‌త్నాలు ప‌వ‌న్ సాగించ‌లేక పోయార‌నేది సోష‌ల్ మీడియా టాక్‌.

ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు ప‌క్క‌న పెడితే.ఏ పార్టీకైనా.

పార్టీ అధినేత‌కైనా సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు, ప్ర‌జ‌ల అండ‌దండ‌లు ఖ‌చ్చితంగా అవ‌స‌రం.కానీ, ఆదిశ‌గా ప‌వ‌న్ కొన్ని రోజులు ప్ర‌య‌త్నం చేసి.

త‌ర్వాత వ‌దిలేశారు.

పైగా త‌మ‌కు అన్యాయం చేశార‌ని కాపులు భావిస్తున్న‌బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

గ‌తంలో చంద్ర‌బాబు కాపుల‌కు 5శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.చేసిన బిల్లు.

ఇప్ప‌టికీ కేంద్రంలో పెండింగ్ ఉంది.సో.కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌లుచుకుంటే.త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌నే భావ‌న కాపుల్లో ఉంది.

కానీ, ఆదిశ‌గా బీజేపీ ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.ఈ నేప‌థ్యంలో కాపుల‌కు అన్యాయం చేస్తున్న బీజేపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకోవ‌డాన్ని కూడా ఈ సామాజిక‌వ ర్గం భ‌రించ‌లేక పోతోంది.

ఇలా ఏవిధంగా చూసుకున్నా.ప‌వ‌న్‌కు కాపులు దూర‌మ‌వుతున్నార‌నేది సోష‌ల్ మీడియా టాక్‌.

మ‌రి ఇప్ప‌టికైనా ప‌వ‌న్ త‌న సామాజిక వ‌ర్గానికి చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube