జగన్ కాపు జాతి ఋణం తీర్చుకోవాలి అంటున్న ముద్రగడ  

కాపుల రిజర్వేషన్ అమలు చేసి ఋణం తీర్చుకోమంటున్న ముద్రగడ. .

Kapu Leader Mudragada Letter To Cm Ys Jagan-kapu Leader Mudragada,kapu Reservation,letter To Cm Ys Jagan,ysrcp

ముద్రగడ పద్మనాభం గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన పని లేదు. కాపు కులానికి పెద్దన్నగా ఉంటూ, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడుగా ఏపీలో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. పార్టీలకి అతీతంగా అన్ని పార్టీలలో ఉన్న కాపు రాజకీయ నేతలు ముద్రగడతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు..

జగన్ కాపు జాతి ఋణం తీర్చుకోవాలి అంటున్న ముద్రగడ-Kapu Leader Mudragada Letter To CM YS Jagan

ఇక గత ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి, తునిలో భారీ ఉద్యమంకి కారణం అయిన ముద్రగడ ఎన్నికల ముందు ఏ పార్టీకి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు ముద్రగడతో పాటు కాపు వర్గం మొత్తం కాపు బలంతో ఉన్న పార్టీ జనసేనకి అండగాగా ఉంటారని భావించారు. అయితే ఊహించని విధంగా కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖ, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో వైసీపీకి కాపు వర్గం బ్రహ్మరథం పట్టింది.

అక్కడ వైసీపీ తరుపున నిలబడిన నేతలకే పట్టం కట్టింది. జనసేన కాపుల పార్టీ అయిన అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో తాజాగా ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి జగన్ ని లేఖ రాసారు.

జనసేనని కాదని కాపులు అందరూ వైసీపీకి మద్దతుగా నిలబడి గెలిపించినందుకు కాపుల రిజర్వేషన్ అమలు చేసి తమ ఋణం తీర్చుకోవాలని గుర్తు చేసారు. మరి ముద్రగడ లేఖపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు చూడాలి.