Mudragada Padmanabham : ఆ సస్పెన్స్ కొనసాగిస్తున్న ‘ ముద్రగడ ‘

చాలాకాలంగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్న కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) 2024 ఎన్నికల్లో మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయన జనసేన పార్టీలో చేరబోతున్నారనే హడావుడి గత కొద్ది రోజులుగా జరిగినా, ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.

ముద్రగడను చేర్చుకునేందుకు జనసేన కూడా అంత తొందర పడుతున్నట్టుగా కనిపించడం లేదు.దీనికి కారణం ముద్రగడ ను చేర్చుకుంటే ఆయనకు ఎంపీ టికెట్ తో పాటు, ఆయన కుమారుడు ముద్రగడ గిరి( Mudragada Giri )కి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాల్సి రావడమే కారణం.

దీంతో ముద్రగడ చేరిక విషయాన్ని పవన్ ప్రస్తుతానికి పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది.ముద్రగడను పార్టీలో చేర్చుకున్నా అనవసర తలనొప్పులు తలెత్తుతాయనే భయమూ పవన్ లో కనిపిస్తోంది.

వాస్తవంగా ముద్రగడ పద్మనాభంను చేర్చుకుంటే, కాపు సామాజిక వర్గం( Kapu Community )లో తిరుగు ఉండదని వైసీపీ సైతం అంచనా వేసింది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ( YCP )లో చేరేకంటే జనసేనలో చేరితేనే మంచిదనే ఆలోచనతో ఉన్నారు.ఇక ఆయన చేరుతారని జనసేన కూడా కొద్ది రోజులు పాటు వేచి చూసింది.

Advertisement

అయితే మొదటి నివాసానికి స్వయంగా పవన్ వెళ్లి ఆయనను ఆహ్వానిస్తారని ప్రచారం జరిగింది.ముద్రగడ ను ఆహ్వానిస్తే ఆయన పెట్టే డిమాండ్లు పార్టీకి తలనొప్పిగా మారుతాయి అనే భయము పవన్ లో ఉంది.

టిడిపి, జనసేన( TDP Janasena ) లు ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేనలో చేరితే కచ్చితంగా తాను, తన కుమారుడు గెలిచి తీరుతామనే అంచనాలో ముద్రగడ ఉన్నారు.

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో ముద్రగడ నివాసానికి పవన్ వెళ్లి ఆయనను పార్టీలోకి రావాల్సిందిగా స్వయంగా పవన్ ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతున్నా, ముద్రగడ విషయంలో పవన్ అంత సానుకూలంగా లేరట.ఆయనను చేర్చుకున్నా పార్టీకి రాబోయే రోజుల్లో తలనొప్పులు వస్తాయని, అలాగే సీట్ల సర్దుబాటు విషయంలో అనవసర పేచీలు ఉంటాయని పవన్ భావిస్తున్నారని, అందుకే ముద్రగడ విషయంలో మరికొన్ని రోజులు పాటు వేచి చూస్తే మంచిదని పవన్ భావిస్తున్నట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు