"ధోని"పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖలు!!!

భారత క్రికెట్ మాజీ సారధి కపిల్ దేవ్ ధోని పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.అదే క్రమంలో మిగిలిన ఆటగాళ్లను తన పదునైన మాటలతో ఏకి పడేశాడు.

 Kapil Says “hats Off” To Dhoni-TeluguStop.com

ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలం తమ కుర్చీలను అట్టిపెట్టుకుని ఉండే క్రీడా పాలకులు మహేంద్ర సింగ్ ధోనీని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.టెస్టుల నుండి సరైన సమయంలో ధోనీ తప్పుకొని, అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.

ఎవరైనా ఆడాలనుకుంటే రెండువందల టెస్టులు కూడా ఆడవచ్చునని చెప్పారు.కానీ ధోనీ మాత్రం అలా చేయలేదన్నారు.

తాను చేయగలిగింది చేశా, ఇక తర్వాత తరం ఆడుకోనివ్వండి అంటూ సంకేతాలిస్తూ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడన్నారు.అందుకు తాను ధోనీని అభినందిస్తున్నానని, ధోని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు అని ధోనిపై ప్రశంశల వర్షం కురిపించాడు కపిల్‌దేవ్.

అదే క్రమంలో కపిల్ గ్రెగ్ చాపెల్ గతంలో చెప్పిన ఒక మాటను గుర్తు చేశాడు…”ఓ ఆటగాడు తన సమయం దాటిపోయాక కూడా కొనసాగితే.తర్వాత మూడు తరాలకు నష్టం చేకూర్చినట్లే” అని గతంలో గ్రెగ్ కపిల్ తో చెప్పినట్లు కపిల్ తెలిపాడు.

అయితే ఇదేదో ధోనిపై ప్రేమతోనో, లేక ధోనీని పొగిడే క్రమంలోనో మాట్లాడిన మాటల్లా అనిపించడం లేదు.ధోనీని అడ్డుపెట్టుకుని మిగిలిన ఆటగాళ్లను ఏకేసినట్లుగా కనిపిస్తుంది అన్న మాటలు సైతం అక్కడక్కడా వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube