అమెరికా రాజకీయాల్లో భారతీయుల హవా నడుస్తోంది.ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ ఎన్నికవ్వగా.మరికొందరు ఇండో అమెరికన్లు సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులుగా ఎన్నికయ్యారు.అయితే ఏ ఎన్నికలు జరిగినా భారతీయుల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వుంటుందని గతంలో ఎవరో చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతోంది.
అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పలువురు ఎన్ఆర్ఐలు బరిలో నిలిచారు.తాజాగా వర్జీనియా గవర్నర్ రేసులో ప్రముఖ ఇండో అమెరికన్ పారిశ్రామిక వేత్త పునీత్ అహ్లువాలియా వున్నారు.
ఈయన కోసం స్థానిక భారతీయ సమాజం అన్ని రకాలుగా అండ దండలు అందిస్తోంది.వీటికి అదనంగా హర్యానా హారికేన్, టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సైతం పునీత్ కోసం రంగంలోకి దిగారు.ఆయనను లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిపించాలంటూ భారతీయులను కోరుతున్నారు కపిల్.ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు భారత మాజీ కెప్టెన్.
ఈ వీడియోలో పునీత్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కపిల్.అవసరమైతే తానే వచ్చి సాయం చేస్తానని స్పష్టం చేశారు.
మే 8న జరగనున్న హైబ్రిడ్ సదస్సులో రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించనుంది.ఈ ఎన్నికల్లో కనుక పునీత్ అహ్లువాలియా విజయం సాధిస్తే.
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని చేపట్టిన తొలి ఇండో అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు.ఈ సందర్భంగా కపిల్ దేవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు పునీత్.
55 ఏళ్ల అహ్లువాలియా ఢిల్లీలో జన్మించారు.1990లలో అమెరికాకు వలస వచ్చిన ఆయన… అఫ్ఘనిస్తాన్కు చెందిన నాడియాను వివాహం చేసుకున్నారు.ఇక వర్జీనియా విషయానికి వస్తే.గడిచిన పదేళ్ల కాలంలో భారతీయ అమెరికన్ల కుటుంబాల వలసలు ఇక్కడికి బాగా పెరుగుతున్నాయి.దీనితో పాటు క్రికెట్ అంటే విపరీతంగా ఇష్టపడే దక్షిణాసియా దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన వారు వర్జీనియాలో పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు.ఇక అన్నింటికి మించి వర్జీనియాలో ఎన్నో క్రికెట్ క్లబ్‌లు వున్నాయి.2010 సమయంలో ఇండో అమెరికన్లు అత్యధిక స్థాయిలో వున్న రాష్టాల్లో వర్జీనియా ఏడో స్థానంలో నిలిచింది.2019లో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా గణాంకాల ప్రకారం.ఈ రాష్ట్రంలో 5 లక్షలకు పైగా ఆసియా అమెరికన్లు వున్నారు.వీటన్నింటిని బేరీజు వేసుకుని పునీత్ అహ్లువాలియా వ్యూహాత్మకంగా వ్యహరించి.కపిల్ దేవ్‌తో ప్రచారం చేయించినట్లుగా తెలుస్తోంది.